Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ ప్రాభవం.. అంబానీ సంస్థలు డౌన్.. అదానీ కంపెనీ అప్!

Webdunia
మంగళవారం, 26 మే 2015 (12:55 IST)
కేంద్రంలో నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.10లక్షల కోట్లు పెరిగింది. ఇదే సమయంలో ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల సంస్థల ప్రాభవం తగ్గిపోతే.. అదానీ మాత్రం దూసుకెళ్లారు. అంబానీ గ్రూపు సంస్థలతో పాటు ఐటీసీ, ఎల్అండ్ టీ గ్రూపులు సైతం తమ మార్కెట్ క్యాప్‌ను కోల్పోయాయి. 
 
అదానీతో పాటు టాటాలు, భారతీ, హెచ్ డీఎఫ్సీ, సన్ గ్రూపులు లాభాలను పండించుకున్నాయి. గత రెండు నెలలుగా మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ, మొత్తం మీద 12 శాతం లాభాన్ని సెన్సెక్స్, నిఫ్టీలు అందుకున్నాయి. ముఖేష్ అంబానీ ఆధీనంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ మార్కెట్ విలువ గతేడాదితో పోలిస్తే రూ. 80 వేల కోట్లు తగ్గి రూ. 2.90 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ కంపెనీ ఈక్విటీ విలువ 20 శాతం దిగజారింది.
 
అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని సంస్థల మార్కెట్ క్యాప్ రూ. 50 వేల కోట్లు పడిపోయింది. అయితే గుజరాతీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అధీనంలోని సంస్థల మార్కెట్ విలువ రూ. 50 వేల కోట్లు పెరిగింది. టాటా సంస్థలు రూ. 1.10 లక్షల కోట్లు, హెచ్ డీఎఫ్ సీ, సన్ గ్రూప్ సంస్థలు రూ. లక్ష కోట్లకు పైగా లాభాలను ఆర్జించాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments