Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డీ రేట్లను సవరించిన లక్ష్మీ విలాస్ బ్యాంకు

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2009 (13:08 IST)
దేశంలో ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన లక్ష్మీ విలాస్ బ్యాంకు మరోమారు వడ్డీ రేట్లను సవరించింది. అక్టోబరు ఒకటో తేదీ (గురువారం) నుంచి సవరించిన వడ్డీ రేట్లు అమలుకు వస్తాయని ఆ బ్యాంకు అధికారులు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

డొమెస్టిక్ టర్మ్‌లో 15 రోజుల నుంచి యేడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఒక యేడాది రెండేళ్ళ లోపు, రెండేళ్ళ నుంచి మూడు సంవత్సరాల లోపు కాలపరిమితి కలిగిన వడ్డీ రేట్లలో మాత్రం స్వల్పంగా మార్పులు చేసింది.

ఒక యేడాది నుంచి రెండేళ్ల లోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రెగ్యులర్ కస్టమర్లకు ఇస్తూ వస్తున్న 7.50 శాతం వడ్డీని ఏడు శాతంగా తగ్గించారు. అలాగే, సీనియర్ సిటిజన్స్‌కు 8.25 నుంచి 7.75 శాతానికి తగ్గించారు. ఇకపోతే, రెండేళ్ళ నుంచి మూడేళ్ళ లోపు కాలపరిమితి కలిగిన వడ్డీ రేట్లను 8 శాతం నుంచి 7.75 శాతంగాను, సీనియర్ సిటిజన్స్‌లలో 8.75 శాతం నుంచి 8.50 శాతంగాను తగ్గించినట్టు ఆ బ్యాంకు ఏజీఎం శ్రీనివాసన్ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

Show comments