Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో అందమైన అధరాలకు.. పెదాలు ఎర్రగా ఉండాలంటే..

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2016 (09:07 IST)
సాధారణంగా చలికాలంలో చర్మంతోపాటు పెదాల ఆరోగ్యానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఇలాంటి వారికోసం అందమైన అధరాల కోసం ఈ చిట్కాలు పాటించడం వల్ల పెదాల ఆరోగ్యంతోపాటు అందాన్నీ కాపాడుకోవచ్చు. అవేంటో చూద్ధాం. 
 
కొద్దిగా తేనెలో రోజ్‌వాటర్‌ లేదా నానబెట్టిన గులాబీ రెబ్బల పేస్టు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని రోజుకి రెండుసార్లు చొప్పున పెదాలకు రాసుకొని 10 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలకు ఎర్రటి రంగు వస్తుంది. 
 
ఒక చెంచాడు పసుపును పాలతో ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకొని 5 నిమిషాల తర్వాత కడిగేసి లిప్‌బామ్‌ రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల నలుపు పోయి పెదాలు అందంగా కనిపిస్తాయి. 
చక్కెరలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్క్రబ్‌ తయారు చేయాలి. దీనితో పెదాలను కొద్దిసేపు రుద్దాలి. ఈ విధంగా రెండు రోజులకొకసారి చేస్తే పెదవులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 
 
క్యారెట్‌ లేదా బీట్‌రూట్‌ను పేస్టులా చేసి దానిలో రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున తేనె, ఆలివ్‌ ఆయిల్‌ కలపాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయం, రాత్రి పెదాలకు రాసుకొని పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై మృతకణాలు తొలగిపోయి, అందంగా కనిపిస్తాయి. 
 
స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి దానిలో కొద్దిగా పెట్రోలియం జెల్లీ కలపాలి. ఈ మిశ్రమం లిప్‌బామ్‌లా పనికొస్తుంది. దీన్ని పెదాలకు రాసుకోవడం వల్ల నలుపు రంగు పోయి అందంగా, మృదువుగా అవుతాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments