శీతాకాలంలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలంటే..?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (22:07 IST)
శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడం కష్టమే అయినా ఇవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా చర్మాన్ని కాపాడుకోవచ్చంటున్నారు చర్మ నిపుణులు. చర్మం జిడ్డు కారుతుంటే ఓ రకం సమస్యలు ఎదురైతే పొడిబారినట్లుంటే మరోరకం సమస్యలు తలెత్తుతాయట. చర్మం బాగా పొడిగా ఉంటే ఎన్ని క్రీములు, లోషన్లు రాసినా ప్రయోజనం ఉండదట. అందుకే సహజసిద్థంగా చర్మాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నించాలంటున్నారు చర్మనిపుణులు.
 
శీతకాలంలో గాలులకు చర్మం పొడిగా, బిరుసుగా తయారవుతుంది. సహజంగానే ఏ విధమైన చర్మం కలిగిన వారికైనా తెల్లగా పొట్లిపోయినట్లుగా కళా విహీనంగా తయారవుతుంది. కొంతమంది బాగా పగిలిపోయి ఇబ్బంది కూడా కలిగిస్తుంది. అలాంటి వారు చర్మం సంరక్షణ పట్ల మరింత శ్రద్థ చూపాలంటున్నారు చర్మ నిపుణులు.
 
శీతాకాలంలో సబ్బు వాడటం ఎంత తగ్గిస్తే అంత మంచిది. సబ్బును, చర్మాన్ని పొడిబార్చే ఇతర ఉత్పత్తులను ఉపయోగించకూడదు. సబ్బు చర్మంలోని తైలాన్ని పొడిబార్చి, రంధ్రాలు మూసుకుపోవడానికి కారణమవుతుంది. కాబట్టి చర్మంలోని తేమను కాపాడుకోవాలంటే గ్లిజరిన్ కలిగిన సబ్బు వాడితే మంచిది. అది కూడా రోజులో ఒకటి రెండుసార్లు కంటే ఎక్కువ వాడటం మంచిది కాదు. 
 
చర్మాన్ని తేమబరిచే గుణం కలిగిన మాయిశ్చరైజర్లతో ముఖానికి మర్థన చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో మలినాలు పేరుకు పోకుండా కాపాడుకోవచ్చు. ముఖానికి రాసుకునే చాలా క్రీముల్లో వ్యాక్స్ అధికంగా ఉంటుంది. క్రీమ్ లోని నీటి పరిణామం ఆవిరైపోతే గట్టి వ్యాక్స్ పదార్థం అలాగే ఉండిపోయి చర్మ రంధ్రాలు మరింత మూసుకుపోతాయట. కనుక క్రీమ్ లను జాగ్రత్తగా పరిశీలించి ఉపయోగించాలి. 
 
చలికాలంలో రాత్రి పడుకునే ముందు రోజూ చర్మానికి నైట్ క్రీమ్ లు రాసుకోవాలి. పాలు, పళ్ళు చెరుకుతో తయారయ్యే ఆల్ఫా హైడ్రోక్సి యాసిడ్స్ ఉండే క్రీమ్ లు మాత్రమే రాసుకోవాలట. దీని వల్ల చర్మం పొడిగా అయి కళావిహీనంగా మారకుండా మృదువుగా మెరుస్తూ ఉంటుందంటున్నారు చర్మ నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ రాజు

మద్యం తాగొద్దన్న తల్లి - చంపేసిన కుమార్తె.. ఎక్కడ?

వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?

భోజ్‌పూర్‌లో యువకుడు ఎన్‌కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు

సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi proud: ప్రధాని కలవడం అక్కడ న్యూ ఏజ్ మెగాస్టార్ టైటిల్ ఇవ్వడం తండ్రిగా గర్వంగా వుంది

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

తర్వాతి కథనం
Show comments