Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొడిబారిన చర్మాన్ని కాంతివంతంగా తయారుచేయాలంటే?

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:36 IST)
చలి కాలం వచ్చేసింది. శీతాకాలంలో పెదవులు ముఖంపై చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దానివల్ల పొడారిపోవడం, గరుకుగా తయారుకావడం, చర్మం బిగుతుగా మారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని నివారించుకోవడానికి ఇంట్లో ఉన్న పదార్ధాలతోనే కొన్ని చిట్కాల ద్వారా ఔషధాన్ని తయారుచేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది పొడి చర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. మెడ నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును కూడా వదిలిస్తుంది.
 
2. పొడి చర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్ సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. దేనితో కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను యధాతథంగా ఒంటికి రాసి మర్దనా చేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది.
 
3. రోజూ పడుకునే ముందు ముఖానికి బాదం నూనె కానీ, ఆలీవ్ ఆయిల్ కానీ రాయాలి. ఆయిల్ పెట్టే ముందు మురికి లేకుండా చర్మం శుభ్రంగా ఉండాలి.
 
4. రోజూ పదినిమిషాలు గోరువెచ్చని నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని మునిగేటట్లు ఉంచాలి. ఉదయం స్నానం చేయడానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందు కానీ చేయవచ్చు.
 
5. ఒక కోడిగుడ్డు సొనలో ఒక టీస్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగయిదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. పొడి చర్మానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments