Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యకు లైట్ గా మీసాలు కనబడుతున్నాయి... వీటిని పోగొట్టే మార్గం ఏమిటి...?

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (16:44 IST)
అవాంఛిత రోమాలను తొలగించడానికి ఎన్నో సౌందర్య సాధనాలు ఉన్నప్పటికీ వీటివల్ల ఫలితం తాత్కాలికమే. అందువల్ల అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవల్ కు అత్యాధునిక సౌందర్య చికిత్సలు ఉన్నప్పటికీ వీటి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందనేది అనుమానమే. కాబట్టి ఈ చికిత్సల కంటే ఇంట్లోనే మనకు లభించే వస్తువులతో హెయిర్ రిమూవర్ ను తయారుచేసుకుని అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.
 
శనగపిండి పేస్టు వాడి చూడండి....
అరకప్పు శనగపిండిలో అరకప్పు పాలు, ఒక టీ స్పూన్ పసుపు, తాజా మీగడ(పొడి చర్మతత్వం కలిగి ఉంటేనే) కలుపుకుని ఈ పేస్టును ముఖంపై వెంట్రుకలు పెరిగే దిశలో అప్లై చేయాలి. అరగంట ఆగిన తర్వాత ఆ పేస్టు పూర్తిగా ఆరిన తర్వాత మాస్కును వేళ్లతో హెయిర్ గ్రోత్ కు వ్యతిరేక దిశలో రుద్దాలి. పేస్ట్ మరీ పొడిగా అనిపిస్తే వేళ్లను కొద్దిగా తడి చేసుకోవచ్చు. ఇలా చేశాక పేస్ట్ అంతా ముఖంపై నుంచి పోయాక తడి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. 
 
 
చక్కెర - నిమ్మరసం... 
రెండు స్పూన్ల చక్కెర, రెండు స్పూన్ల తాజా నిమ్మరసం, నీళ్లు తీసుకుని చక్కెర కరిగే వరకూ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. 15 - 20 నిమిషాలు ఆగాక వేళ్లతో సున్నితంగా రుద్దుతూ కడిగేయాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తుంటే అవాంఛిత రోమాలు తగ్గుముఖం పడుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments