Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మానికి నిగారింపు చేకూర్చే ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకోండి.

పూర్వ కాలం నుంచి నేటి వరకు సంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండు శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక పాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌లో చిటికెడు పసుపు,

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (15:59 IST)
మినపప్పు, పసుపు పేస్ట్ :
పూర్వ కాలం నుంచి నేటి వరకు సంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండు శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక పాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌లో చిటికెడు పసుపు, కాస్త నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసిన అరగంట సేపు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 
 
కళకళలాడేందుకు మినపప్పు ఫేషియల్ :
అందాన్ని కాపాడే ముఖ్యమైన వస్తువు మినపప్పు. నిర్జీవంగా కనిపించే చర్మానికి యౌవనాన్ని ఇచ్చేదే మినపప్పు. రెండు స్పూన్ల మినపప్పులో కాస్త నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రంచేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు మినపప్పు చర్మానికి పూసి స్నానం చేస్తే చర్మం అందంగా యౌవన్నంగా కనిపిస్తుంది.
 
రోస్ వాటర్, మినపప్పు :
రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌తో నాలుగు స్పూన్ల పాలు, రెండు స్పూన్ల రోస్ వాటర్ కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రపరచాలి. ఇలా చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందమైన, ఆకర్షణమైన ముఖం మీ సొంతం అవుతుంది. 
 
మచ్చలు మాయం కావాలంటే
మినపప్పు 1 టీస్పూన్, మిరియాల గింజ ఒకటి తీసుకోని ఒక టీస్పూన్ పాలులో ఊరబెట్టాలి. దీనితో పాటు కాల్ టీస్పూన్ ముల్తాని మట్టిని చేర్చి కలపాలి. ఈ మిశ్రమాని ప్యాక్‌లా వేసుకొని ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇలా చేస్తే మచ్చలు క్రమంగా మటుమాయం అయిపోతాయి.
 
జిడ్డు చర్మానికి
జిడ్డు చర్మం ఉన్నవారు మినపప్పుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫేషియల్‌లా వేసుకుంటే జిడ్డు తొలగి ముఖం అందంగా మారిపోతుంది. ఒక పాత్రలో మినపప్పు తీసుకొని అందులో కాస్త పెరుగు, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే జిడ్డు తగ్గి ముఖం అందంగా మారుతుంది. 
 
డల్‌గా ఉన్న ముఖం కోసం
తోలుతోపాటు ఉన్న మినపప్పు అరకిలో, తులసీ ఆకులు 50 గ్రాములు, వేపాకులు 5 గ్రాములు తీసుకొని వీటిని నీడలో ఎండబెట్టాలి. అనంతరం ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేయాలి. ఒక పాత్రలో ఈ మిశ్రమాన్ని రెండు స్పూన్లు తీసుకొని అందులో రెండు చుక్కలు నిమ్మరసం చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఐదు నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇది వారానికి ఒక్కసారి వేస్తే చాలు కళకళలాడుతూ మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

అప్రమత్తంగా ఉండండి: సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం, నాశనం చేస్తే చట్టపరమైన చర్యలు

దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకంటే.. పవన్‌పై అలా?

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

తర్వాతి కథనం
Show comments