Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం కళకళలాడాలేంటే సున్నిపిండితో 3 ప్యాక్స్ ట్రై చేయండి!

Webdunia
గురువారం, 25 సెప్టెంబరు 2014 (17:09 IST)
ముఖం కళకళలాడాలేంటే సున్నిపిండితో 3 ప్యాక్స్ ట్రై చేయండి!.. అంటున్నారు.. బ్యూటీషన్లు సున్నిపిండితో రోజ్ వాటర్, పసుపు, సున్నిపిండి పాలతో ప్యాక్స్ వేసుకుంటే చర్మకాంతి పెరపుగుతుంది. అందాన్ని కాపాడే ముఖ్యమైన వస్తువు మినపప్పు. నిర్జీవంగా కనిపించే చర్మానికి యవ్వనాన్ని ఇచ్చేదే మినపప్పు. 
 
అలాంటి మినపప్పుతో స్కిన్ కేర్ టిప్స్ ఏంటో చూద్దాం.. రెండు చెంచాలా మినపప్పు పిండిలో కొద్దిగా నీళ్ళు పోసి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. అదేవిధంగా స్నానం చేసేటప్పుడు సున్నిపిండిని చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మం అందంగా యవ్వనంగా మెరిసిపోతుంది.
 
అలాగే సున్నిపిండి-రోజ్ వాటర్ ప్యాక్‌తో మృదువైన చర్మాన్ని పొందవచ్చు. రెండు చెంచాల సున్నిపిండి పౌడర్ లో నాలుగు చెంచాల పాలు, రెండు చెంచాల రోజో వాటర్ కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేసినట్లైతే చర్మంలోని జిడ్డు తొలగి అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది.
 
ఇక సున్నిపిండి.. పసుపుతో ప్యాక్ ఎలా వేసుకోవాలంటే.. పూర్వకాలం నుంచి నేటి వరకూ సాంప్రదాయబద్దంగా ఉపయోగించే వస్తువు మినపప్పు, పసుపు. ఇవి రెండూ శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అందాన్ని ఇచ్చేవి. ఒక ప్రాత్రలో రెండు స్పూన్ల మినపప్పు పౌడర్‌లో చిటికెడు పసుపు, కాస్త నీటిని వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిన అరగంట సేపు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరిచినట్లైతే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
 
అలాగే మచ్చలు మాయం కావాలంటే.. చెంచా సున్నిపిండి, పెప్పర్ పౌడర్ చిటికెడు, ముల్తానీ మట్టి పాలుతో మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి తర్వాత ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మచ్చలు క్రమంగా మటుమాయం అయిపోతాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments