ప్రతిరోజూ పెదవులకు తేనె రాసుకుంటే ఫలితం ఏమిటో తెలుసా?

మనం తీసుకునే ఆహారం, అధిక వేడీ, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పెదాలు సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారుతాయి. ఆ సమస్యను తగ్గించాలంటే కొన్ని రకాల పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడమే దీనికి చక్కటి పరిష్కారం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.... 1. టీ, కాఫీలు తా

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (19:24 IST)
మనం తీసుకునే ఆహారం, అధిక వేడీ, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పెదాలు సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారుతాయి. ఆ సమస్యను తగ్గించాలంటే కొన్ని రకాల పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడమే దీనికి చక్కటి పరిష్కారం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.... 
 
1. టీ, కాఫీలు తాగడం వల్ల కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ఇందులోని ఫాలీఫినాల్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. అంతేకాదు వయసు పెరగడం, ఎండ వేడి వల్ల కమిలిపోయిన పెదాలకు రక్షణ కల్పిస్తాయి. టీ బ్యాగుల్నీ పెదాలపై మృదువుగా మర్దనా చేయడం వల్ల ఎండిపోయి పగిలిన పెదాలకు సాంత్వన లభిస్తుంది.
 
2. టొమాటోలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. వీటిలో సెలినీయం అనే యాంటీఆక్సీడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని, పెదవులను కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూసుకోవాలి. ఎండలో నుంచి రాగానే మీ పెదాలకు టొమాటో గుజ్జు లేదా రసం పూయడం వల్ల అవి తమ సహజ రంగును కోల్పోవు సరికదా తాజాగానూ ఉంటాయి.
 
3. ప్రతిరోజు చెంచా తేనె తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే రాత్రుళ్లు పెదాలకు తేనె రాసుకుని మర్నాడు కడిగివేయాలి. తేనెలోని యాంటీ ఆక్సీడెంట్లు, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పెదాలపై ఉండే నలుపుదనాన్ని పోగొడతాయి.
 
4. పెరుగు మన శరీరానికి చలువ చేస్తుంది. దీనిలో మాంసకృత్తులు మీ చర్మాన్ని దృడంగా, నవయవ్వనంగా ఉంచుతాయి. దీనిని రోజూ మీ భోజనంలో తీసుకోవాలి. కాస్తంత పెరుగును చేత్తో తీసుకుని మీ పెదాలకు రాసుకున్నా అవి క్రమంగా మృదువుగా మారుతాయి. పిగ్మంటేషన్ సమస్యను కూడా తగ్గిస్తాయి.
 
5. గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిమ్మ సహజ బ్లీచ్ లా పని చేస్తుంది.  నిమ్మ తొక్కపై కొంచెం చక్కెర వేసి దానిని పెదాలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై నలుపు తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments