బ్యూటీపార్లర్లకు ఎందుకు..? మచ్చలు, మొటిమలు తగ్గాలంటే?

పంచదారను మిక్సీలో రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. అందులోనే నిమ్మరసం కలుపుకుని పక్కనబెట్టుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఐదు లేదా పది నిమిషాల పాటు ఆవిరి పట్టాల

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (15:22 IST)
పంచదారను మిక్సీలో రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. అందులోనే నిమ్మరసం కలుపుకుని పక్కనబెట్టుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఐదు లేదా పది నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. పొడి బట్టతో తుడుచుకున్నాక బౌల్‌లో వున్న పంచదార మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేసుకుంటూ.. మొటిమలు వున్న చోట శుభ్రం చేసుకుంటూ కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే చర్మానికి గ్లో వస్తుంది. మచ్చలు. మొటిమలు తగ్గిపోతాయి. బ్యూటీపార్లర్ల వెంట తిరగాల్సిన అవసరం వుండదు. 
 
అలాగే చర్మపు మృతకణాలు తొలగి కోమలంగా తయారవ్వాలంటే అలోవెరా జెల్‌, కీర దోస ముక్కలను కలిపి గుజ్జుగా చేసి అందులో ఓట్‌మీల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలపాటు చేతి వేళ్లను గుండ్రంగా తిప్పుతూ ముఖం మీద మర్దనా చేయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.

చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్‌, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్‌ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments