Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొడిబారిన జుట్టుకు ఇవిగోండి చిట్కాలు.. ఆలివ్‌ నూనెతో మేలెంతో

పొడిబారిన జట్టుతో ఇబ్బందులు పడుతున్నారా? జుట్టు రాలిపోకుండా ఉండాలా? అయితే ఈ టిప్స్ పాటించండి. కలబంద గుజ్జును నాలుగు టీ స్పూన్లు తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె, పెరుగు కలిపి తలకు పట్టించి గ

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (15:33 IST)
పొడిబారిన జట్టుతో ఇబ్బందులు పడుతున్నారా? జుట్టు రాలిపోకుండా ఉండాలా? అయితే ఈ టిప్స్ పాటించండి. కలబంద గుజ్జును నాలుగు టీ స్పూన్లు తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె, పెరుగు కలిపి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు పొడిబారటం తగ్గిపోతుంది. తలస్నానం చేసే ముందురోజు వేరుశనగ నూనె, బాదం నూనె, కొబ్బరి నూనెలను సమపాళ్ళలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.
 
అలాగే గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టిస్తే ఈ పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి. గుడ్డులోని తెల్లసొనలో మూడు చెంచాల వెనిగర్‌, ఒక చెంచా ఆలివ్‌ నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు తిరిగి తేమ అందుతుంది. పొడిబారటం తగ్గుతుంది.
 
జుట్టు రాలిపోవడం అధికమైతే.. పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తెల్లసొన వేసి బాగా కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

తర్వాతి కథనం
Show comments