మొటిమలు, మచ్చలకు చెక్ పెట్టాలంటే..? వెనిగర్, బొప్పాయి భేష్‌గా పనిచేస్తాయ్

మొటిమలు, మచ్చలు వేధిస్తున్నాయా? డబ్బులు పోసి క్రీములు కొనొద్దు. ఈ టిప్స్ పాటించండి చాలు. రెండు చెంచాల తేనె, ఒక చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి. ఈ పేస్టు ముఖానికి పూతలా రాసుకుని 20 నిమిషాల తర్వాత గ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (13:19 IST)
మొటిమలు, మచ్చలు వేధిస్తున్నాయా? డబ్బులు పోసి క్రీములు కొనొద్దు. ఈ టిప్స్ పాటించండి చాలు. రెండు చెంచాల తేనె, ఒక చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి. ఈ పేస్టు ముఖానికి పూతలా రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
అలాగే పచ్చి బంగాళాదుంపను ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
 
నారింజ తొక్కల పొడిని రెండు చెంచాల మోతాదులో తీసుకుని దీనికి కొన్ని నీళ్లు చేర్చాలి. అలా వచ్చిన పేస్టును ముఖానికి రాసి ఇరవై నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఒక చెంచా వెనిగరల్‌లో మూడు చెంచాల నీళ్లు కలపాలి. అందులో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల అనంతరం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలు మాయమవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments