Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో చర్మ రక్షణకు నూనెలు చేసే మేలు..

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (14:24 IST)
చలికాలంలో పడిపోయే ఉష్ణోగ్రత, వీచే చలిగాలులు చర్మాన్ని చాలా ఇబ్బందిపెడతాయి. కాబట్టి చర్మానికి ఈ రుతువులో అదనపు రక్షణ అవసరం. ఆ రక్షణను అందించే నూనెలను చర్మ మీద మర్దన చేసినప్పుడు అవి చర్మాన్ని నునుపుగా చేస్తాయి. అందుకు ఉపకరించే నూనెలు...
 
కొబ్బరి నూనె : దీనిలో లవణాలు అధికం. కాబట్టి కొబ్బరి నూనెను చలికాలంలో శరీరానికి రాసుకుంటే ముడుతలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం ఏ తరహాకి చెందినదైనా కొబ్బరి నూనె వాడకం సరైనదే. పలు రకాల చర్మరోగాలు సోకకుండా కాపాడే శక్తి కొబ్బరినూనెకుంది.
 
ఆలివ్‌ నూనె : చర్మ సౌందర్యానికి చక్కని సాధనం ఆలివ్ నూనె. దీనిలో ఉన్న విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్స్ వల్ల చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు. ఆలివ్ నూనె మర్దన చేస్తే చర్మం ఎంతో చక్కని తేజస్సును పొందుతుంది.
 
ఆల్మండ్ నూనె: ఈ నూనె చలికాలంలో బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఆల్మండ్ నూనె చర్మాన్ని ఎండిపోనివ్వదు. ఈ నూనె రాసుకుంటే చర్మం తేమను గ్రహిస్తుంది. మీ చర్మం ఏ తరహాది అయినా ఈ ఆయిల్‌ని రాసుకోవచ్చు. దురద, మంట వంటి సమస్యలను చర్మానికి రానివ్వదు. చర్మం పగలకుండా సంరక్షిస్తుంది. 
 
నువ్వుల నూనె : ఈ నూనెలో ఉన్న విటమిన్ బి, ఇ లు చర్మానికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కాల్షియమ్, మెగ్నీషియమ్‌ల ద్వారా చర్మం లబ్దిపొందుతుంది. సూర్య కాంతి ప్రభావం చర్మం మీద పడకుండా రక్షిస్తుంది. నువ్వుల నూనెతో శరీరం మర్దన చేయించుకుంటే అలసట ఇట్టేపోతుంది. చర్మానికి తాజాదనం సమకూరి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.
 
జజోబానూనె : దీనిలోని సూక్ష్మజీవ సంహారగుణం వల్ల చక్కని రక్షణ నిస్తుంది. చర్మంలో సహజంగా ఉత్పత్తి అయ్యే తైలాలకు, జబోబా ఆయిల్‌లో ఉన్న రసాయనాలకు దగ్గరి పోలిక కనిపిస్తుంది. అందువల్ల బజోబా నూనెను చర్మం ఎటువంటి ప్రతి చర్య చూపకుండానే గ్రహిస్తుంది. ఇది రాసుకుంటే చర్మానికి ఎలర్జీ ఉండదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments