Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్తానీ మట్టి, కర్పూరంతో మొటిమలు పరార్....

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (12:00 IST)
ముల్తానీ మట్టి, లవంగం నూనె, గంధం పొడిని పాత్రలో తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీనికి వేప ఆకుల పేస్టు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రుద్దుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడిగేయాలి. రోజూ ఇలాచేస్తే మొటిమలు మాయమై, ముఖం కాంతివంతగా మారుతుంది. ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్, కర్పూరం మిశ్రమాన్ని ఫ్రిజ్‌ల్ ఉంచాలి. ఈ పేస్ట్ అప్లై చేస్తే ముఖం మీది మలినాలు తొలగి, తాజాగా కనిపిస్తుంది. 
 
కొన్ని న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తీసుకుని బాగా న‌లిపి ముఖంపై రాయాలి. కొంత సేప‌టి త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. నిత్యం ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. శాండల్‌వుడ్ పౌడ‌ర్‌, ప‌సుపు, పాల‌ను కొద్ది మొత్తంలో తీసుకుని పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. దీన్ని ముఖంపై రాసి కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖానికి మెరుపు వ‌స్తుంది.
 
కొద్దిగా తేనె, పాల‌పై మీగ‌డ‌ను తీసుకుని బాగా క‌లిపి ముఖంపై రాయాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ఉన్న చ‌ర్మం మృదుత్వాన్ని, కాంతిని సంత‌రించుకుంటుంది.  కొద్దిగా పాలు, ఉప్పు, నిమ్మ‌ర‌సంల‌ను తీసుకుని ముఖానికి రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ప‌డిన మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments