Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. మూడు స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, దోసకాయ గుజ్జు, మూడు టేబు

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (16:59 IST)
వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. మూడు స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, దోసకాయ గుజ్జు, మూడు టేబుల్ స్పూన్స్ శెనగపిండిని పేస్టులా కలుపుకుని... ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషాల తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
అలాగే ముల్తానీ మట్టి, తేనే, పసుపుతో చేసిన ప్యాక్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని, 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగాలి.
 
అలాగే రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, అర టేబుల్ స్పూన్ గంధపు పొడి, చిటికెడు పసుపును తీసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.. పావు గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిలీ అండ్ పొడి చర్మాల వారికి మంచి ఫలితాలనిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments