Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలమేదైనా పెదవుల సంరక్షణ తప్పదు మరీ!

Webdunia
బుధవారం, 16 జులై 2014 (19:48 IST)
కాలమేదైనా చర్మ సంరక్షణలు జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా మొహంలో అత్యంత సున్నిత భాగాలైన పెదాలు, కళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలంలో పెదాలు ఎండిపోయినట్టు కనిపించి పగిలి పోతాయి. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా పెదాలు తొందరగా పొడిబారడమే. ఎన్ని లోషన్స్ రాసినా కొద్దిసేపటికే పొడిబారిపోతాయి. 
 
అందువల్ల కాలంతో పనిలేకుండా మీ పెదాలు నునుపుగా మెరిసిపోతూ ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు కొన్ని సలహాలు చెపుతున్నారు. అంవేంటో పరిశీలిద్దాం. పెదాలలో నూనె గ్రంధులు లేకపోవడం వల్ల తొందరగా చిట్లిపోవడం, పొడిబారడం జరుగుతుంది. తేమగా ఉండటానికి కావాల్సినంత మాయిశ్చరైజర్‌ను పెదాలకు ఆరకుండా రాస్తూ ఉండాలి. 
 
అలాగే, ప్రతిరోజూ పడుకునేముందు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా తీసేయాలి. వెన్నతో పెదాలను మృదువుగా మసాజ్ చేయాలి. ఎప్పుడూ పెదాలను పొడిగా వదిలేయకుండా, నాణ్యత కలిగిన లిప్ లోషన్ తీసుకుని తరచూ పెదాలకు అప్లై చేస్తుండాలి. పెదాలు ఆరోగ్యంగా ఉండటానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. బ్లాక్ టీ బ్యాగ్‌ను గోరు నీటిలో ముంచి రెండు మూడు నిమిషాల పాటు దానిని పెదాలపై నెమ్మదిగా అద్దండి. ఇది పెదాలలో తేమను పెంచుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments