Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమలు ఉన్నాయా.. పోగొట్టడం చాలా ఈజీ....

మొటిమలు.. టీనేజ్ వయస్సులో యువతీయువకులను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. శ్వేద గ్రంథులకు సంబంధించిన వ్యాధినే మొటిమలు అంటారు. హార్మోన్లలో లోపం, కాలుష్యం కారణంగా మొటిమలు వస్తాయి. ముఖం మీదే కాదు మెడ, ఛాతిపైన వస్తుంటాయి. వీటి నుంచి బయట పడడానికి వివిధ రకాల క్రీ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (14:57 IST)
మొటిమలు.. టీనేజ్ వయస్సులో యువతీయువకులను చాలా ఇబ్బంది పెట్టే సమస్య. శ్వేద గ్రంథులకు సంబంధించిన వ్యాధినే మొటిమలు అంటారు. హార్మోన్లలో లోపం, కాలుష్యం కారణంగా మొటిమలు వస్తాయి. ముఖం మీదే కాదు మెడ, ఛాతిపైన వస్తుంటాయి. వీటి నుంచి బయట పడడానికి వివిధ రకాల క్రీములు ఉపయోగిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. 
 
మొటిమలు ఉన్న వారు ప్రతిరోజు మూడుపూటలు సబ్బుతో ముఖం కడుక్కోవాలి. ఇంట్లో ఉన్న పండ్లు, కూరగాయలతో స్కబ్ చేస్తుంటే మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూరను మరింత ఎక్కువగా తీసుకోవాలి. పాలకూరలోని విటమిన్-ఎ శరీరంలో పేరుకుపోయిన బ్యాక్టీరియా ట్యాక్సిన్‌లను బయటకు పంపేస్తోంది. 
 
అలోవిరా జల్‌ను ముఖంపై వేసుకుని కొద్దిసేపు తరువాత కడిగేసుకుంటూ ఫలితాన్నిస్తాయి. అలోవిరా జెల్‌లో యాంటి ఇన్షమెంటరీ అధికంగా ఉండటం వల్ల సహాయపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు మొటిమలు ఉండేచోట పసుపు అప్పుడప్పుడూ రాస్తూ ఉండాలి. 
 
కొంతమందికి సబ్బులు పడవు. అలాంటి వారు సున్నిపిండిని ఉపయోగిస్తే చాలా మంచిది. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మవ్యాధుల నుంచి దూరంగా ఉంటాం. నిమ్మతో కూడా మొటిమలపై రుద్దితే తగ్గిపోతాయి. చిన్నపుండ్లు ఉంటే వాటిపైనా నిమ్మతో రుద్దాలి. మొటిమలను అసలు రుద్దకూడదు. మొటిమలు గిల్లితే సెప్టిక్ అయ్యే అవకాశం వుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments