Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెడిక్యూర్‍‌తో పాదాలు పదిలం..

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (10:57 IST)
చాలా మంది యువతీ యువకులు, స్త్రీపురుషుల పాదాలు పగిలిపోయి ఉంటాయి. ఇలాంటి వారు తమ పాదాలను కోమలంగా ఉంచుకునేందుకు తమకు తోచిన విధంగా వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తుంటారు. నిజానికి పాదాలు కోమలంగా ఉండాలంటే పెడిక్యూర్ చేసుకోవాలి. దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఇంట్లోనే సన్నద్ధం కావాలి. 
 
* నీళ్లు అర బక్కెట్
* గ్లిజరిన్ - రెండు చెంచాలు
* నిమ్మకాయలు - రెండు
* షాంపూ ప్యాకెట్ - 1
* రాతి ఉప్పు - రెండు చెంచాలు. 
 
పెడిక్యూర్ ఇలా చేయాలి.. 
నీళ్లు గోరువెచ్చగా అయ్యే వరకూ వేడిచేయాలి. ఈ నీళ్లను బక్కెట్లో నింపి, పైన చెప్పినవన్నీ కలపాలి. ఉప్పు, షాంపూ కరిగేవరకూ నీళ్లను కలియబెట్టాలి. ఈ నీళ్లలో కాలి గిలకలు మునిగేలా పది నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత పాదాలకు సబ్బు రుద్ది పనికిరాని టూత్ బ్రష్‌తో పాదాలు, మడమలు, వేళ్లు, గోళ్లు రుద్దుకోవాలి. తర్వాత ప్యుమిస్ స్టోన్‌తో రుద్ది మృత చర్మాన్ని తొలగించాలి. తర్వాత ఎక్కువ నీళ్లతో కాళ్లు రుద్ది కడిగేసుకోవాలి. చివరగా పాదాలు తడి లేకుండా తుడిచి కొబ్బరినూనె లేదా వెన్న పూసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments