Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబంద గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే.. ఆ భాగం..?

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (11:38 IST)
ముఖచర్మం అందంగా కనిపించేందుకు రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. ముఖం అందంగా ఉంటేనే సరిపోదూ.. మెడ భాగం కూడా అందంగా ఉండాలి. కొందరికైతే ముఖం తెల్లగా ఉంది.. మెడేమో నల్లగా నల్లగా ఉందని అద్దంలో చూస్తూ చూస్తూ బాధపడుతుంటారు. 

నలుగురిలో తిరడాలంటే చాలా అసహ్యంగా ఉందని చింతిస్తుంటారు. ఈ సమస్యను తొలగించుకోవడానికి బయట దొరికే పదార్థాలు వాడుతారు. కానీ, వీటి కారణంగా సమస్య మరింత ఎక్కువై పోతుందని ఆందోళన చెందుతారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటే తెలుసుకుందాం..
 
బంగాళాదుంపలోని పోషక విలువలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. దీనిలోని రసాయన పదార్థాలు శరీర ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయో.. అందానికి కూడా అంతే ఉపయోగపడుతాయి. ఎలాగంటే.. ఒక చిన్న బంగాళాదుంపను మెత్తని పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా వంటసోడా, ఉప్పు ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెడభాగం తెల్లగా మారుతుంది.
 
కలబందలోని మినరల్స్ చర్మ రంగు కోల్పోకుండా చేస్తాయి. దీనితో ప్యాక్ వేసుకుంటే.. కలిగే ప్రయోజనాలు చూద్దాం.. కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, టమోటా గుజ్జు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. రెండుగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మెడ నల్లగా మారడం తగ్గిపోతుంది. తద్వారా ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది. 
 
యాపిల్ సైడర్ వెనిగర్‌లోని విటమిన్స్ చర్మంపై పేరుకుపోయిన మృతుకణాలను తొలగిస్తాయి. ఈ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు, తేనె కలిగి అందులో దూదిని ముంచి మెడకు మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మెడభాగం మృదువుగా, తాజాగా మారుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments