Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. చాక్లెట్ ప్యాక్ వేసుకోండి!

Webdunia
గురువారం, 25 సెప్టెంబరు 2014 (17:00 IST)
చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. చాక్లెట్ ప్యాక్ వేసుకోండి! అంటున్నారు బ్యూటీషన్లు. చాక్లెట్ ఒక రుచికరంగా.. తీపి ఎక్కువగా ఉంటుంది. చర్మం మీద ద్రవ చాక్లెట్ పోస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అంతేకాక పొడిచర్మంనకు గ్లో ఇస్తుంది. చాక్లెట్ ప్యాక్ తయారుచేయటానికి ఐదు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, ఐదు టేబుల్ స్పూన్ల తేనే, రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, రెండు టేబుల్ స్పూన్ల అవోకాడో గుజ్జు తీసుకోని బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను ప్రతి రోజు పొడి చర్మం ఉన్నవారు వేసుకొని అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మృదువైన కోమలమైన చర్మం మీ సొంతం అవుతుంది. 
 
అలాగే తేనె ప్యాక్ కూడా పొడిబారిన చర్మాన్ని దూరం చేస్తుంది. తేనె ప్యాక్ తేనె పొడి చర్మం కోసం చాలా బాగా పనిచేస్తుంది. తేనె చర్మంపై ఏర్పడే ముడతలను పోగొట్టి, మృదువుగా ఉంచుతుంది. తేనె మరియు నారింజ రసం మిశ్రమంను చర్మం మీద రుద్ది, 10 నిమిషాల తర్వాత వాష్ చేయాలి.
 
గుడ్డులో ఆరోగ్యకరమైన చర్మం కోసం అవసరమైన ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ఇది పొడి చర్మం కోసం ఉత్తమ హోమ్మేడ్ బ్యూటీ చిట్కాలలో ఒకటి. ఈ ప్యాక్ తయారుచేయటానికి, గుడ్డు నుండి తెలుపు, పసుపు సొనలను వేరుచేయాలి. ఆ తరువాత, గుడ్డు పచ్చసొన తీసుకొని బాగా కలిపి, దానిలో ఒక టేబుల్ స్పూన్ నారింజ రసం, ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ తేనె, కొన్ని చుక్కల రోజ్ వాటర్,కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి ఉదయం స్నానానికి ముందు రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments