Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షంలో తడిసి జుట్టు జిడ్డుగా మారుతుందా? ఈ చిట్కాలు పాటిస్తే....

వర్షంలో కొన్నిసార్లు జుట్టు తడిసిపోతుంటుంది. దాని వలన జుట్టు నుండి వాసన రావడం, ఎండు గడ్డిలా మారడం చాలామందికి జరుగుతుంటుంది. ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారికి కొన్ని బ్యూటీ చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలు

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (12:52 IST)
వర్షంలో కొన్నిసార్లు జుట్టు తడిసిపోతుంటుంది. దాని వలన జుట్టు నుండి వాసన రావడం, ఎండు గడ్డిలా మారడం చాలామందికి జరుగుతుంటుంది. ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారికి కొన్ని బ్యూటీ చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
వర్షాకాలంలో జుట్టు తేమను అధికంగా పీల్చుకుంటుంది. కాబట్టి వారంలో రెండుసార్లు తలస్నానం చేయాలి. రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలను కూడా అధికంగా వాడకూడదు. ఇలాంటి షాంపూల వలన జుట్టు ఊడిపోతుంది. దానికి బదులుగా హెర్బల్ షాంపూలు వాడితే ఉపశమనం కలుగుతుంది. వర్షంలో తడిసి జుట్టు జిడ్డుగా మారుతుంది.
 
అందువలన కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసాన్ని, ఉసిరిపొడి కలుపుకుని తలకు పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం జుట్టులో జిడ్డు తొలగిపోతుంది. అదే సమయంలో పట్టులా కూడా మారుతుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, కలబంద గుజ్జును కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు రాసుకోవాలి.
 
గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్యలు తొలగిపోతాయి. పావుకప్పు పెరుగులో కొద్దిగా ఆలివ్ నూనె, నిమ్మరసం కలుపుకుని తలకు రాసుకోవాలి. 40 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన వర్షంలో తడిసినప్పుడు జుట్టు జిడ్డుగా మారకుండా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments