Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింటాకు పొడిని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే..?

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (17:52 IST)
బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజసిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి. జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు పొడవుగా అవుతాయి. 250 గ్రాముల మజ్జిగ, పది గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. నిమ్మకాయ రసంతో తలంతా మర్ధన చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది.
 
మందార పువ్వులను ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారాక ఒక సీసాలో నిలవచేసుకుని ప్రతిరోజూ రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది. గోరింటాకు ఎండబెట్టి పొడిగా చేసుకుని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి. 
 
పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది. మార్కెట్లో దొరికే కలర్‌ డైలను ఎక్కువగా వాడకూడదు. సాధ్యమైనంత వరకూ సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్లో మెహిందీ పొడి దొరుకుతుంది. దానితో సహజసిద్ధమైన డైని తయారుచేసుకుంటే మంచిది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవు. 
 
ఉసిరికపొడి కూడా జుట్టును నల్లగా మార్చడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. పెద్ద ఉసిరికాయలు (ఆమ్లా) చౌకగా లభ్యమయ్యేకాలంలో వాటిని తీసుకుని ఎండబెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకుని... వాటిని తలకు పట్టిస్తే చుండ్రు, పేలు నివారణ అవుతాయి. మార్కెట్లో లభ్యం అయ్యే చౌకరకాల షాంపూలను, సబ్బులను వాడితే చుండ్రు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments