Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆముదం నూనెలో దూదిని ముంచి కనుబొమలకు రాస్తే...

కనుబొమలు బాగా కనబడడానికి మార్కెట్లో ఎన్నో రకాల మందులు ఉన్నాయి. తీర్చిదిద్దినట్టు చక్కగా కనుబొమలు ఉంటే ఆ ఆకర్షణే వేరు. అయితే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మన కనుబొమలకు చక్కని ఔషధం తయారుచేసుకోవచ్చు. అవేంటంటే... 1. ఆముదం నూనెలో దూదిని ముంచి కనుబొమలకు రాసుక

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (21:53 IST)
కనుబొమలు బాగా కనబడడానికి మార్కెట్లో  ఎన్నో రకాల మందులు ఉన్నాయి. తీర్చిదిద్దినట్టు చక్కగా కనుబొమలు ఉంటే ఆ ఆకర్షణే వేరు. అయితే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మన కనుబొమలకు చక్కని ఔషధం తయారుచేసుకోవచ్చు. అవేంటంటే...
 
1. ఆముదం నూనెలో దూదిని ముంచి కనుబొమలకు రాసుకోవాలి. పది నిముషాలయిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా మూడు వారాలు పాటు చేయడం వల్ల కనుబొమలు అందంగా ఉంటాయి. 
 
2. ఉల్లిపాయ రసాన్ని కనుబొమ్మలకు అయిదు నిముషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత చల్లని నీటితో కడిగివేయాలి, ఇలా నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
3. గుడ్డుసొన జుట్టుకి మాత్రమే కాకుండా కనుబొమలు ఆకర్షణీయంగా కనపడేలా చేస్తుంది. కేవలం కోడిగుడ్డు సొనను మాత్రమే కనుబొమలకు మాత్రమే రాసుకోవాలి. ఇరవై నిముషాల తరువాత కడిగేసుకోవాలి.
 
4. మెంతులలో ఉన్న ఔషధ గుణాలతో శరీరానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకే వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిద్రపోయే ముందు మెంతులను నీళ్లలో నానబెట్టాలి. ఉదయన్నే వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరినూనెలో కలిపి కనుబొమలకు రాసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చక్కని కనుబొమలు సొంతం.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments