Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, కాఫీపొడితో ఫేస్‌ప్యాక్..?

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (10:11 IST)
పెరుగు ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. పెరుగులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం సౌందర్యాన్ని పెంచేందుకు సహాయపడుతాయి. పెరుగు తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులోని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ చర్మం మృదువుగా, తాజాగా మారేలా చేస్తాయి. అందుకు ఈ టిప్స్ పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
పెరుగులో కొద్దిగా ఉప్పు, చక్కెర, గుడ్డుసొన కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు, మెుటిమలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. 
 
పెరుగులో కొద్దిగా కాఫీపొడి, తేనె కలుపుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయి. నిమ్మరసం చర్మసౌందర్యానికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. 
 
మరి దీనితో ప్యాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం కడిగేసుకుంటే ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

ఎంపీ విజయసాయిరెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాలి.. నారా లోకేష్‌కు విజ్ఞప్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

తర్వాతి కథనం
Show comments