Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిడ్డుకు చెక్ పెట్టే మొక్కజొన్న పిండి.. మేకప్ లేకున్నా మెరుస్తారంతే?

కార్న్ ఫ్లోర్ కూడా ముఖంపై గల జిడ్డు పోగొడుతుంది. మొక్కజొన్న పిండిలో... నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఈ పిండి అదనంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఈ పూ

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (10:38 IST)
ఏ సీజన్ అయినా చర్మం జిడ్డుగా తయారైతే.. రకరకాల క్రీములు వాడాల్సిన అవసరం లేదు. ముఖంపై జిడ్డు పేరుకుని మేకప్ వేసుకుంటే.. మళ్లీ నిర్జీవంగా మారుతుంది. ఈ సమస్యకి పరిష్కారంగా ఇంట్లోనే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది.

పసుపు: దీనిలో యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ రాత్రి పూట చెంచా పసుపులో కొన్ని పాలు పోసి...మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే ముఖంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది. 
 
అలాగే స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలి. కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా చూసుకోవాలి. ఈ నీళ్ల వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
 
ఇక కార్న్ ఫ్లోర్ కూడా ముఖంపై గల జిడ్డు పోగొడుతుంది. మొక్కజొన్న పిండిలో... నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఈ పిండి అదనంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. ఈ పూత వేసుకున్నాక మేకప్‌ వేసుకున్నా ఎక్కువ సమయం తాజాగా కనిపిస్తారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments