Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరుగైన ఫ‌లితం కోసం....ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ !!

ఒకప్పుడు ఆడ‌వాళ్ళు అందంగా, న్యాచురల్‌గా కనిపించడానికి ఎక్కువ హోం రెమిడీస్ పైనే ఆధారపడి, చర్మ, జుట్టు సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేవారు. ముఖ్యంగా వంటింట్లో, గార్డెన్‌లో లభించే బ్యూటీ రెమిడీల‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుం

Webdunia
శుక్రవారం, 22 జులై 2016 (21:45 IST)
ఒకప్పుడు ఆడ‌వాళ్ళు అందంగా, న్యాచురల్‌గా కనిపించడానికి ఎక్కువ హోం రెమిడీస్ పైనే ఆధారపడి, చర్మ, జుట్టు సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేవారు. ముఖ్యంగా వంటింట్లో, గార్డెన్‌లో లభించే బ్యూటీ రెమిడీల‌ను ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం ప్రకాశవంతంగా ఉండేది.కానీ ఇప్పుడు మనం కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఉపయోగిస్తున్నాము. వీటివల్ల ప్రస్తుతం మనం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తున్నాము. హోం రెమిడీస్ ద్వారా చర్మ సమస్యలను ఎఫెక్టివ్‌గా నివారించడంతో పాటు మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
 
* ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఆల్మండ్ ఆయిల్ 2 టీస్పూన్లు రోజ్ వాటర్ 2 టీస్పూన్లు ఒక గిన్నెలో మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత  గోరువెచ్చని నీటితో మైల్డ్ సోప్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.
 
* రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్లో స్కిన్ హైడ్రేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాల్లో మాయిశ్చరైజర్‌ని రీస్టోర్ చేస్తాయి. దీనివల్ల చర్మం స్మూత్‌గా, సాఫ్ట్‌గా మారుతుంది.
 
* ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ కాంబినేషన్ దురద నివారించి చర్మాన్ని స్మూత్‌గా మారుస్తుంది. అలాగే చిన్న చిన్న గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి.  
 
* ఇది డార్క్ సర్కిల్స్‌ని తగ్గిస్తాయి. కళ్ల కింద, నోటి చుట్టూ ఏర్పడే ఈ వలయాలను తగ్గించడమే కాకుండా చర్మ కణాలకు పోషణ అందిస్తుంది. 
 
* ఆయిల్ బేస్డ్ ఫేస్ ప్యాక్ యాక్నెని మరింత పెంచుతాయని భావిస్తారు. కానీ ఈ ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ మిశ్రమం రంధ్రాల్లో ఉండే బ్యాక్టీరియా, దుమ్ముని బయటకు పంపి యాక్నెను నివారిస్తాయి.
 
* ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ రిచ్‌గా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల చర్మంలో ముడతలు, వయసు పెరుగుతున్న లక్షణాలు, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ తగ్గుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments