Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాల పొడి, నిమ్మరసం కలిపి రాత్రిపూట తలకు పట్టించి...?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (12:53 IST)
చాలామంది అందంగా ఉండటం కోసం బయటదొరికే పదార్థాలు, క్రీములు ఎక్కువగా వాడుతుంటారు. వీటి వాడకం కంటే ఇంట్లో సహజసిద్ధమైన పదార్థాలతో కాంతివంతమైన, తాజాదనంగా ఉండే అందాన్ని పొందవచ్చని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు. మరి అందుకు ఏం చేయాలో ఓసారి తెలుసుకుందాం..
 
1. మిరియాల పొడి, నిమ్మరసం కలిపి రాత్రిపూట తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. కోడిగుడ్డు సొనలో అరటిపండు బాగా కలిపి తలకు రుద్దుకుని శుభ్రం గా స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
 
2. వారానికి ఒక్కసారి గ్లిసరిన్, నిమ్మరసం కలిపిన ప్యాక్ వేసుకుంటే ముఖంపై మొటిమలు తగ్గుతాయి. నిమ్మరసం, స్పూన్ వెనిగర్ కలిపి జుట్టుకు రాసి, 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే జుట్టు పెరుగుతుంది.
 
3. మెంతికూర ఆకులు మెత్తగా నూరి తలకు పట్టించుకున్న 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే జుట్టు మురికి పోతుంది. పెదవులు మృదువుగా మెరుస్తూ ఉండాలంటే రోజూ పడుకునే ముందు మీగడను పెదాలకు మర్దనా చేసుకోవాలి.
 
4. రెండు బాదం కాయలను నూరి పాలల్లో కలిపి నిద్రకు ముందు ముఖానికి రాసుకుంటే ముఖం తేజోవంతంగా ఉంటుంది. నారింజ తొక్కలు పొడిచేసి, దానిలో కొంచెం తేనె కలిపి పెదాలకు రోజూ రాస్తూ ఉంటే పెదాలు ఎర్రబడతాయి.
 
5. పుట్టుమచ్చలు పోవాలంటే పచ్చి ధనియాలు నూరి మచ్చలమీద రాసుకోవాలి. జుట్టు ఎక్కువగా రాలుతుంటే రేగు ఆకులు బాగా నూరి జుట్టుకు పట్టించుకుని గంట తరువాత తలస్నానం చేయండి. జుట్టు ఊడకుండా ఉంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments