కోడిగుడ్డులోని తెల్లసొనతో చర్మ సౌందర్యం.. మరిన్ని చిట్కాలు..

రసాయనాలతో కూడిన క్రీములు వంటివి వాడటం కంటే.. మెరిసే సౌందర్యం కోసం సహజ సిద్ధమైన చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో చూద్దాం.. ముఖంపై వుండే మొటిమలను దూరం చేసుకోవాలంటే మహిళలు పోషకాహారం తీసుకోవాలి. జీర్ణక్రి

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:22 IST)
రసాయనాలతో కూడిన క్రీములు వంటివి వాడటం కంటే.. మెరిసే సౌందర్యం కోసం సహజ సిద్ధమైన చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో చూద్దాం.. ముఖంపై వుండే మొటిమలను దూరం చేసుకోవాలంటే మహిళలు పోషకాహారం తీసుకోవాలి. జీర్ణక్రియ సక్రమంగా వుందా అనేది తెలుసుకోవాలి. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవాలి.
 
ముఖంపై మచ్చలు తొలగిపోవాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొనను కప్పులోకి తీసుకుని అందులో సున్నిపిండి కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత పాలతో ముఖాన్ని కడిగేయాలి. ఆపై నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. 
 
ఆరెంజ్ తొక్కల పౌడర్‌లో ముల్తానీ మట్టి, చందనం, పెరుగును కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేయాలి. అలాగే లేత వేపాకులు, ఆరెంజ్ తొక్కల పౌడర్, పసుపును సమపాళ్లలో తీసుకుని.. మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. కంటి వలయాలను దూరం చేసుకోవాలంటే బాదం ఆయిల్ రాయడం మంచిది. 
 
అలాగే బార్లీ పౌడర్‌తో పసుపు పొడి, నువ్వుల నూనెను చేర్చి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. మెడ చుట్టూ వుండే నల్లటి వలయాలను దూరం చేసుకోవాలంటే.. కోడిగుడ్డు తెల్లసొనను తీసుకుని.. గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి పూతలా వేసుకుని అరగంట తర్వాత కడిగేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

iBomma Ravi: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా నిర్భంధంచారో తెలుసా? (Video)

అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది.. కేసీఆర్‌ను కాదు రాహుల్‌ను అలా చేయండి.. కేటీఆర్

కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

Sakshi Vaidya: నాకు పర్సనల్గా చాలా రిలేట్ అయిన పాత్ర చేశా : సాక్షి వైద్య

Raviteja: సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి తో సరదగా గోలగోల చేద్దాం : రవితేజ

ద్రౌప‌ది 2 నుంచి పీరియాడిక్ ట‌చ్‌తో సాగే తారాసుకి..సాంగ్ రిలీజ్

Aishwarya: ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ గా సీతా పయనం నుంచి సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments