కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్ తేనె కలిపి....

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (20:39 IST)
కొబ్బరి బొండాలు సౌందర్య పోషణలోనూ బాగా పనిచేస్తాయి. చర్మాన్ని, శిరోజాలను మెరిపించే సుగుణం కొబ్బరిబొండాం నీళ్లలో మెండుగా ఉంది. ఈ నీళ్లతో పాటు కొబ్బరి పాలను కూడా సౌందర్య పోషణలో వాడొచ్చు. వేసవికాలంలో ప్రతిరోజు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని మూడు నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల భానుడి ప్రతాపానికి నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
 
అరకప్పు కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్ తేనె కలిపి ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతం అవుతుంది.
 
వేసవిలో చెమటతోపాటు చర్మంపై పేరుకుపోయే మురికివల్ల మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే కొబ్బరిపాలలో రెండు చుక్కుల నిమ్మరసం కలిపి పదినిమిషాల తరువాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దాలి. కాసేపటి తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము పోయి చర్మం తాజాగా ఉంటుంది.
 
చిక్కటి కొబ్బరిపాలలో కొన్ని తేనె చుక్కలు, రెండు టేబుల్ స్పూన్ బియ్యపు రవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి పదినిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే మృదువైన పాదాలు సొంతమవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Prabhala Utsavam: కోనసీమ జిల్లాలో సంక్రాంతి ప్రభల ఉత్సవం

Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?

గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు

తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

తర్వాతి కథనం
Show comments