Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిప్‌స్టిక్‌ సరిగా అంటక పోతే ఏంచేయాలి?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (16:22 IST)
కాస్మొటిక్స్‌ని ఎప్పటికప్పుడు నిర్ణీత సమయం అయిపోగానే మారుస్తుండాలి. లేకపోతే వాటివల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దేన్ని ఎన్ని రోజులకొకసారి మార్చాలో తెలుసుకుందాం. 
 
లిక్విడ్‌ ఐలైనర్ల కన్నా పెన్సిల్లే ఎక్కువ రోజులు పనిచేస్తాయి. కానీ ఈ రెండింటినీ కూడా మూడు నెలలకోసారి మారుస్తుండాలి. సాధారణంగా అవి కొన్నిరోజుల తర్వాత సువాసన పోయి జిగటగా అంటుకుంటుంటాయి. అలా అయితే అవి పాడైపోయానని అర్థం. 
 
లిప్ స్టిక్‌లో వాసన, సాంద్రతల్లో తేడా రాగానే మార్చేయాలి. అలాగే లిప్‌స్టిక్‌ సరిగా అంటకపోయినా, రంగు మారినా దాన్ని వాడకుండా ఉండడం మంచిది.
 
లిక్విడ్‌ బేస్డ్‌ ఫౌండేషన్‌ని ఒక్కసారి సీల్‌ తీసిన ఆరునెలల తర్వాత మార్చేయాలి. ఒకవేళ అంతలోపే దాని రంగులోగానీ, వాసనలోగానీ ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే దానిలో స్థానంలో కొత్తది తెచ్చుకోవాలి. 
 
మస్కారాని మూడు నెలలకొకసారి తప్పనిసరిగా మార్చాలి. అలాగే ఎప్పటికప్పుడు వాసనని గమనిస్తూ ఉండాలి. లేకపోతే కళ్ళకు హాని కలిగే అవకాశం ఉంది. 
 
సాధారణంగా ఫేస్‌ పౌడర్‌, పౌడర్‌ బ్లష్‌లను రెండు సంవత్సరాలకోసారి మారుస్తుండాలి. ఒకవేళ అప్పటికే బ్యాక్టీరియా ఏర్పడినట్టనిపిస్తే వాటిని వాడడం మానేయాలి. ఐషాడో వంటి వాటిల్లోకి సులభంగా తేమ చేరుతుంటుంది. వీటి రంగు, వాసన మారినట్లనిపిస్తే వెంటనే దాన్ని చెత్తలో వేయడం మంచిది. వీటన్నిటితోపాటు మీకు అలర్జీ వంటివి కలుగజేసే కాస్మొటిక్స్‌ ఏవైనా ఉంటే.. వాటిని నిరుపయోగంగా ఉంచకండి. పడేయండి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments