స్నానానికి ముందు కొబ్బరి నీళ్ళలో కాస్త పెసరపిండి కలిపి..?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (11:26 IST)
కొన్ని సార్లు మొటిమలు పోయి మచ్చలు మాత్రం మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు కొబ్బరి పాలతో ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్తున్నారు బ్యూటీషన్లు. మరి ప్యాక్ ఎలా వేసుకోవాలంటే.. కొబ్బరిపాలలో స్పూన్ గులాబీ నీరు, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తప్పక మచ్చలు పోతాయి.
 
కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో నిమ్మరసం, పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే నిర్జీవంగా మారిన చర్మం కొత్త కాంతిని పొందుతుంది.
 
రోజూ స్నానానికి ముందు కొబ్బరి నీళ్ళలో కాస్త పెసరపిండి, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా పట్టించాలి. ఆపై 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఇలా రోజూ స్నానానికి ముందు చేస్తే చర్మం శుభ్రపడుతుంది. మచ్చలు తగ్గుతాయి.
 
తరుచు మృతుకణాల సమస్య వేధిస్తుంటే.. కొబ్బరి తురుములో స్పూన్ పాలమీగడ, తేనె, నిమ్మరసం, శెనగపిండి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. చర్మం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రంప్‌ను వెక్కిరిస్తూ డాన్స్ చేసిన మదురో, అందుకే వెనెజులాపై దాడి చేసారా?

కరూర్ తొక్కిసలాట: టీవీకే చీఫ్ విజయ్‌కి సమన్లు జారీ చేసిన సీబీఐ

నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కు 'సర్' నోటీసులు

వెనెజులా ముగిసింది, గ్రీన్ ల్యాండ్ పైన ట్రంప్ కన్ను, ఏం జరుగుతుంది?

Power Bills: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గనున్న విద్యుత్ బిల్లులు.. చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

అనసూయ హీరోయిన్ కాదా?

తర్వాతి కథనం
Show comments