కుంకుమ పువ్వుతో ఫేస్‌ప్యాక్..?

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (11:33 IST)
చర్మం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. సన్‌ట్యాన్ వలన చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చర్మం మళ్లీ కాంతివంతంగా మారాలంటే కొన్ని ఫేస్‌ప్యాక్స్ వేసుకుంటే సరిపోతుందని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం...
 
గంధం పొడిని పాలతో కలిపి పేస్ట్‌‍లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అదే జిడ్డు చర్మతత్వం ఉన్నవారు గులాబీ నీటిలో కలిపి రాసుకోవచ్చు. గంధం నూనెను రెండు చుక్కల స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం పరిమళ భరితమవుతుంది.
 
కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. మరి దీనితో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. నాలుగు స్పూన్ల పాలు వేడిచేసి అందులో 4 చుక్కల నిమ్మరసం, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చెవులు, మెడలకు రాసుకోవాలి. ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఆ తరువాత మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచు చేస్తుంటే.. ముఖం తాజాగా మారుతుంది.
 
క్యాబేజీని మిక్సీలో మెత్తని గుజ్జుగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె, శెనగపిండి, పసుపు చేర్చి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ పెయింటింగులలో ప్రాణాలున్నాయా? రాజా రవివర్మ పెయింటింగ్ రూ. 167 కోట్లు

తిరుమల, రెండో ఘాట్ రోడ్డు.. సుమో వాహనంలో నిప్పులు

AP Thanks India, ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం చట్టబద్ధత ఇదే తొలిసారి, చంద్రబాబు పూజలు

అమెరికాను వణికిస్తున్న 'సికాదా' - భారత్‌లోకి ఎంట్రీ కానుందా?

సినిమాల్లో నటించాలనే ఆశతో భాగ్యనగరికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు... (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల

Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్

శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే

Ravi Basrur: కటాలన్ కు సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్

Satya: సత్య, రియా సింఘా పై సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments