Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిస్తేజానికి "మాయిశ్చరైజర్"తో చెక్..‌!

Webdunia
రోజువారీ పనుల్లో కొట్టుకుపోతున్న నేటి మహిళలు మాయిశ్చరైజర్ వాడకాన్ని కూడా గబగబా కానిచ్చేస్తుంటారు. కాస్తంత మాయిశ్చరైజర్ చేతిలోకి తీసుకుని గబగబా ముఖమంతా పులిమేసి, తయారై ఆఫీసులకు పరుగులు పెడుతుంటారు. అయితే ఇలా కాకుండా ముఖంలోని నిస్తేజాన్ని మాయం చేసేలా మాయిశ్చరైజర్‌ని వాడవచ్చు. అదెలాగంటే..

ముందుగా... మాయిశ్చరైజర్‌గానీ, క్లెన్సర్‌‌ని గానీ రెండు చేతులతో చూపుడు వేలు, మధ్య వేళ్ల మీద తీసుకోవాలి. ముఖం మీద గుండ్రంగా తిప్పుతూ దాన్ని లోపలికి ఇంకిపోయేలా మర్దనా చేయాలి. చుబుకం మీదినుంచి చెవి వరకు, పై పెదవి నుంచి చెవి వరకు, ముక్కు నుంచి దవడ మీదికి వేళ్లతో సుతిమెత్తగా మర్దనా చేయాలి.

అలాగే.. కనుబొమలపైన మధ్య నుంచి మొదలుపెట్టి కణతల వరకు, నుదుటి మధ్యలోంచి రెండు వైపులకూ... వేళ్లను కదిలిస్తూ మర్దనా చేయాలి. ఇలా చేసిన తరువాత ముఖాన్ని చూస్తే... తేడా ఇట్టే తెలిసిపోతుంది. మెరిసిపోతూ కనిపిస్తున్న ముఖాన్ని చూడగానే ఎవరికైనా పెదవులపై చిరునవ్వు కనిపించక మానదు.

ఇందులో రహస్యం ఏమీ లేదుగానీ... వేళ్లతో మర్దిస్తూ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దానివల్ల ముఖంలోని నిస్తేజమంతా పరారైపోయి, ఉత్సాహం తొణికిసలాడుతూ కనిపిస్తుందంతే...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

Show comments