Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌‌కు భారత్ అనుమతి, ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:32 IST)
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు వేగంగా పెరుగుతున్న సమయంలో రష్యా వ్యాక్సీన్‌కు అనుమతి లభించింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకా సురక్షితమైనదని, ఇది భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో తయారవుతున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌లాగే పనిచేస్తుందని భావిస్తున్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సీన్ కోవిడ్-19 నుంచి దాదాపు 92 శాతం రక్షణ కల్పించగలదని 'ది లాన్సెట్‌'లో ప్రచురించిన చివరి దశ ట్రయల్స్ ఫలితాలను బట్టి తెలుస్తోంది.

 
భారత్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఇప్పటికే 10కోట్ల డోసులకు పైగా వేశారు. కరోనా పాజిటివ్ కేసుల్లో బ్రెజిల్‌ను దాటి భారత్ రెండోస్థానంలో ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటీ 35 లక్షలు దాటింది. అమెరికాలో 3 కోట్ల 10 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అక్కడున్నాయి. కరోనా కేసుల్లో మొన్నటి వరకు రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్.. భారత్‌లో కోవిడ్ విజృంభనతో ఇప్పుడు మూడోస్థానంలో ఉంది. అక్కడ కోటీ 34 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

 
జులై చివరి నాటికి దేశంలో అర్హత ఉన్న 25 కోట్ల మందికి టీకాలు వేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ భారత్‌లో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని, వేగం పెంచకపోతే లక్ష్యాన్ని అందుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

 
స్పుత్నిక్ వి గురించి మనకు ఎంత తెలుసు
మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సీన్‌‌ చివరి ట్రయల్స్ ఫలితాలు రాక ముందు కాస్త వివాదాస్పదమైంది. కానీ ఈ వ్యాక్సీన్‌తో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు నిరూపితమయ్యిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఒక కోల్డ్ టైప్ వైరస్‌ను ఉపయోగిస్తుంది. అది శరీరానికి కరోనావైరస్ చిన్న భాగాన్ని అందించే ఒక కారియర్‌లా, ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తుంది. అలా ఈ టీకా వైరస్ జెనెటిక్ కోడ్‌కు తగ్గట్టు శరీరాన్ని సురక్షితంగా ఎక్స్‌పోజ్ చేస్తుంది. ముప్పును గుర్తించి, అనారోగ్యానికి గురవకుండా దానితో ఎలా పోరాడాలో గుర్తిస్తుంది.

 
టీకా వేసుకున్నాక శరీరం యాంటీ బాడీస్‌ను, ముఖ్యంగా కరోనావైరస్‌తో పోరాడే యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే, కరోనావైరస్ నిజంగానే వ్యాపించినపుడు, రోగనిరోధక శక్తి దానితో పోరాడేలా సిద్ధంగా ఉంటుంది. స్పుత్నిక్ వ్యాక్సీన్‌ను 2 నుంచి 8 సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య (సాధారణ ఫ్రిజ్‌ ఉష్ణోగ్రత) నిల్వ చేయవచ్చు.

 
రిపోర్టుల ప్రకారం ఈ టీకాను మార్కెటింగ్ చేస్తున్న రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) భారత్‌లోని ఆరు వ్యాక్సీన్ తయారీదారులతో కలిసి 75 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంది. కానీ దీని రెండో డోస్ భిన్నంగా ఉంటుంది. స్పుత్నిక్ టీకా రెండు డోసులు వేరువేరుగా ఉంటాయి. ఈ టీకా మొదటి డోసు వేసుకున్న 21 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. కానీ దీని వెర్షన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. రెండు డోసులూ కరోనావైరస్ స్పైక్‌ లక్ష్యంగా పనిచేస్తాయి. కానీ రెండు వేరు వేరు వెక్టర్స్(రోగ వాహకాలు) ఉపయోగిస్తాయి. న్యూట్రలైజ్ చేసిన వైరస్ శరీరంలోకి స్పైక్‌ను తీసుకెళ్తుంది.

 
ఒకే వెర్షన్‌ను రెండు సార్లు ఉపయోగించడానికి బదులు, రోగనిరోధక శక్తిని పెంచడానికి రెండు వేరు వేరు ఫార్ములాలు ఉపయోగించాలనే ఈ ఆలోచన కరోనా వైరస్ నుంచి శరీరానికి దీర్ఘకాలిక రక్షణను అందించవచ్చు. సమర్థమైనదని నిరూపితం కావడంతోపాటూ ట్రయల్ సమయంలో స్పుత్నిక్ వ్యాక్సీన్ వల్ల ఎలాంటి సీరియస్ రియాక్షన్లు కలగలేదని, ఇది సురక్షితమైనది తేలింది.

 
ఈ వ్యాక్సీన్ వల్ల కొన్ని సైడ్ ఎపెక్ట్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, అవి చాలా తక్కువ. చెయ్యి నొప్పి, అలసట, తేలికపాటి జ్వరం లాంటివి ఉండచ్చు. ఈ వ్యాక్సీన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో ఎవరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు రావడం, చనిపోవడం జరగలేదు. స్పుత్నిక్ వి టీకాను రష్యాతోపాటూ అర్జెంటీనా, పాలస్తీనా, వెనెజ్వెలా, హంగరీ, యూఏఈ, ఇరాన్ ఇంకా చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారత్‌లో స్పుత్నిక్ వి టీకా వేయడానికి ఇంకా కొన్ని వారాలు పట్టచ్చు. అప్పటివరకూ దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలనే ఉపయోగించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో రొమాంటిక్ హారర్ జానర్ గా రాజా సాబ్

లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా

విక్రాంత్, చాందినీ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments