Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ స్తనంపై పాము కాటు.. బిడ్డకు పాలిస్తుండగా ఘటన, మృతి - ప్రెస్ రివ్యూ

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:09 IST)
చిన్నారికి పాలిస్తుండగా రొమ్ముపై పాము కాటేడయంతో ఓ తల్లి మరణించినట్లు ఈనాడు పత్రిక కథనం ఇచ్చింది. ‘మహారాష్ట్ర చంద్రాపూర్‌ మండలం సోనాపూర్‌ నుంచి కొందరు కూలీలు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు. మిరప కోతలకు వెళుతూ గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటున్నారు.

 
మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతుండగా, పాప ఆకలితో ఏడ్చింది. దీంతో తల్లి శృతి ప్రమోద్‌ భోయర్‌ (21)కు బిడ్డకు తన పాలిచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ పాము ఆమె రొమ్ముపై కాటేసింది. పాము బిడ్డను కూడా కాటేస్తుందేమో అనే భయంతో ఆమె దాన్ని చేతితో పట్టుకుని విసిరేశారు. దీంతో కొద్ది దూరంలో నిద్రిస్తున్న రూపేష్‌ ప్రకాష్‌ చప్డే అనే యువకుడిపై పడిన పాము అతడిని కూడా కాటేసింది.

 
వారిని వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. శృతి చనిపోయారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. శృతి మృతదేహానికి పరీక్ష పూర్తయ్యాక బంధువులు స్వస్థలానికి తీసుకెళ్తార’’ని ఈనాడు కథనం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments