Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్ 2: ల్యాండర్ ‘విక్రమ్’ దిగాల్సిన ప్రదేశం ఫొటోలు తీసిన నాసా

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (17:11 IST)
చంద్రయాన్ 2లో ఇస్రో ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిందని అమెరికా అంతరిక్ష సంస్థ నానా వెల్లడించింది. నాసా తాజాగా చంద్రయాన్ 2 ల్యాండింగ్ సైట్‌కి చెందిన హై రిజల్యూషన్ చిత్రాలను విడుదల చేసింది.


చంద్రయాన్ 2 ల్యాండర్ ఆచూకీ కనిపెట్టేందుకు నాసా కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిట్ కెమెరా తీసిన చిత్రాలను సెప్టెంబర్ 26న ట్వీట్ చేసింది.

 
అయితే ఈ చిత్రాలను రాత్రి వేళ తీసినందున విక్రమ్ ఆచూకీ స్పష్టంగా కనిపెట్టలేకపోయామని నాసా స్పష్టం చేసింది. అక్టోబరులో ఆ ప్రాంతంలో వెలుగు వస్తుందని అప్పుడు కచ్చితంగా ల్యాండర్ విక్రమ్ ఆచూకీ కనిపెడతామని నాసా తెలిపింది. 

 
చీకట్లో ఉండొచ్చు
నాసా తన వెబ్ సైట్లో పేర్కొన్న కథనం ప్రకారం... సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2 ల్యాండర్ చంద్రుడి మీద హార్డ్ ల్యాండ్ అయ్యింది. అంటే అది చంద్రుడి ఉపరితలాన్ని నేరుగా ఢీకొట్టింది. ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 17న తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిటర్ కెమెరా 150 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ తీసిన ఫోటోలను ఇప్పుడు విడుదల చేసింది. అయితే తమ బృందాలు విక్రమ్ ల్యాండర్‌ను కానీ, అది కూలిన ప్రదేశాన్ని కూడా గుర్తించలేకపోయాయని తెలిపింది.

 
ఈ చిత్రాలు తీసే సమయంలో చంద్రుడి మీద ప్రాంతమంతా చీకటిగా ఉంది. ఆ పెద్ద పెద్ద చీకటి ప్రాంతాల్లో ఎక్కడో విక్రమ్ ఉండి ఉండవచ్చని నాసా తన వెబ్ సైట్లో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments