Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్: అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే పాడెపై నుంచి లేచి కూర్చున్నాడు - ప్రెస్ రివ్యూ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (13:53 IST)
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పాడెపైనుంచి లేచి కూర్చున్నట్టు ఈనాడు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. చనిపోయాడనుకొని అంత్యక్రియలకు తీసుకెళ్తున్న ఓ వ్యక్తి మార్గమధ్యంలో పాడెపై లేచి కూర్చున్న సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

 
గ్రామస్థుల కథనం మేరకు.. మండలంలోని కట్టుబావి సమీపంలో చెట్టుకింద ఓ వ్యక్తి కొంతకాలంగా ఉంటున్నాడు. స్థానికులు పెట్టే భోజనం తిని జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజులుగా ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో చనిపోయినట్లు భావించి గ్రామ కార్యదర్శి మనోహర్‌, వీఆర్వో నాగరాజుకు స్థానికులు సమాచారం అందించారు.

 
చివరకు గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలకు ఏర్పాట్లుచేశారు. మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఆ వ్యక్తి ఒక్కసారిగా పాడెపై లేచి కూర్చున్నాడని పత్రిక చెప్పింది. అధికారులు వెంటనే 108కు సమాచారం అందించి బాధితుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 
ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని బంధువులు ఎవరైనా ఉంటే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రావాలని వైద్య సిబ్బంది కోరుతున్నారని ఈనాడు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments