Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పండంటే ఇష్టం లేకపోయినా తినాల్సిందే!

Webdunia
మంగళవారం, 7 అక్టోబరు 2014 (17:06 IST)
బొప్పాయి పండంటే ఇష్టం లేకపోయినా తినాల్సిందే! అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. కొందరు బొప్పాయి అంటేనే విముఖత చూపుతారు. కానీ, ఇందులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా తినేస్తారు. 
 
ధర తక్కువతో కూడిన బొప్పాయిలో ఉండే పీచు పదార్థం హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పీచు పదార్థం పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తగ్గించడంలోనూ సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
అజీర్తితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఇక, ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. హార్ట్ పేషెంట్లు దీన్ని ఎలాంటి అనుమానం లేకుండా స్వీకరించవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 
 
ఇందులో ఉండే బీటా కెరోటిన్ వ్యాధి నిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. క్రమం తప్పకుండా బొప్పాయిని తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుందట. ప్రధానంగా స్త్రీలలో బహిష్టు సమయంలో కనిపించే నొప్పుల నుంచి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments