ఉసిరి కాయను ఎవరు తినకూడదు...

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (09:49 IST)
ఔషధ గుణాలకు నెలవు ఉసిరి. అయితే.. దీన్ని తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు కలిగినప్పటికీ కొంతమంది మాత్రం అస్సలు వాడకూడదని ఆయుర్వేదం చెబుతున్నది. 
 
* ఉసిరిలో విటమిన్ సి అధికం. దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఆమ్ల ప్రభావం కారణంగా అసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. దీనివల్ల మూత్రంలో మంట, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు కలుగుతాయి. 
* మధుమేహం, రక్తపోటు ఉన్నవారు, రక్తం గడ్డ కట్టేందుకు మందులు వాడేవారు ఉసిరికి దూరంగా ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వీటిని తినొచ్చు. 
 
* డయేరియా, వికారం, తిమ్మిర్లు, నోటి దురద, తలనొప్పి ఉన్నవారు ఉసిరిని తీసుకోకూడదు. లేదంటే ఆ లక్షణాలు ఇంకా అధికం కావొచ్చు. 
* శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు ఉసిరిని తీసుకుంటే వారిలో రక్తస్రావం అధికంగా జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటివారు చికిత్స అనంతరం కనీసం రెండు వారాల వరకు ఉసిరి జోలికి వెళ్లకపోవడం మంచిది. 
 
* శరీరాన్ని చల్లబరిచే గుణం ఉసిరికి ఉంది. దగ్గు, జలుబు ఉన్నవారు వీటిని తినడం వల్ల ఇవి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. 
* గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు ఉసిరిని ఇవ్వకపోవడమే మంచిది. లేదంటే వారిలో అతిసారం, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments