Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరేణితో అలెర్జీకి చెక్.. ఉత్తరేణి ఆకులను బూడిద చేసి..?

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (10:32 IST)
uttareni
ఉత్తరేణి ఆకుతో శరీరంపై దురద, పొక్కులు, పొట్టు రాలడం వంటి సమస్యలకి ఉత్తరేణి దివ్యౌషధంగా పనిచేస్తుంది. గాయం తగిలినప్పుడు రక్తం కారడం కూడా ఉత్తరేణి ఆకుతో నిలుపవచ్చు. ఉత్తరేణి మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 
 
గాయాలైనప్పుడు రక్తం నిలువకుండా కారుతుంటే, ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయం పైన పిండితే రక్తం కారడం నిలిచిపోతుంది. కందిరీగలు, తేనెటీగలు, తేలు కుట్టినప్పుడు ఉత్తరేణి ఆకుల్ని మెత్తగా నూరి కుట్టిన చోట పెట్టడం వల్ల నొప్పి, దురద తగ్గుతాయి. అలానే శరీరంపై దురద, పొక్కులు, పొట్టు రాలుతుంటే శరీరం పై ఉత్తరేణి ఆకుల రసాన్ని పోయడం వల్ల ఆ వ్యాధులన్నీ తగ్గుతాయి.
 
అంతే కాదండి పంటి నొప్పి ఎక్కువగా ఉంటె… ఉత్తరేణి గింజల పొడిని, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నింటినీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్టును పంటిపై పెట్టుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగిపోతుంది.
 
ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దానిని ఆముదముతో కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనంగా చేయాలి. ఇలా చేయడం వల్ల అవి తగ్గి పోతాయి. పొట్ట మీద కొవ్వు కరగాలంటే నువ్వుల నూనెలో ఉత్తరేణి ఆకుల రసాన్ని వేసి బాగా మరగనిచ్చి. దానిని పొట్ట మీద రాస్తే కొవ్వు కరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments