Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీర్ణశక్తికి తులసి దివ్యౌషధం: తులసి ఆకులు, మిరియాలు నూరి..?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (17:48 IST)
తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు. తులసీ పూజనీయమైనదే కాక తులసిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలను కలిగివుంటుంది. అవేంటో తెలుసుకుందాం.. ముఖ్యంగా కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి.
 
కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది. జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది. 
 
ముఖ్యంగా 7, 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటారు. ఆకలి లేదంటుంటారు. అలాంటివారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది. ప్రధానంగా తులసి జ్వరహారిణి. సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. పైగా టైఫాయిడ్ జ్వరంలో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూటా తాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది.
 
ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. ఉబ్బస నివారణ ఆయుర్వేద మందులన్నింటిలోనూ తులసి తప్పకుండా ఉంటుంది. తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు ఉబ్బసం రాదు. అవసాన దశలో ఉన్న మనిషికి తులసి తీర్థం పోయడంలో అర్థం ఏమిటంటే వారి గొంతులో కఫం ఏమైనా అడ్డుపడకుండా శ్వాస సరిగా తీసుకుంటారని ఆవిధంగా చేస్తారు. ఇదీ తులసి మహాత్మ్యం.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments