Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము నొప్పితో బాధపడేవారు తీసుకోకూడని పదార్థాలు ఏమిటి?

నడుము నొప్పిని కటిశూల లేదా ప్రిష్టశూల అని ఆయుర్వేదంలో అంటారు. నడుంనొప్పి ఉన్నవాళ్ళు మొదట మూడు రోజులు ద్రవాహారం తీసుకుంటూ ఉపవాసంచేస్తే, జీర్ణాగ్ని సరిగ్గా తయారై కడుపులో ఆమం తగ్గి విషపదార్థాలు బయటకు వెళతాయి. ఆ తరువాత బరువైన ఆహారం తీసుకోకుండా ఉంటే అన్ని

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (18:58 IST)
నడుము నొప్పిని కటిశూల లేదా ప్రిష్టశూల అని ఆయుర్వేదంలో అంటారు. నడుంనొప్పి ఉన్నవాళ్ళు మొదట మూడు రోజులు ద్రవాహారం తీసుకుంటూ ఉపవాసంచేస్తే, జీర్ణాగ్ని సరిగ్గా తయారై కడుపులో ఆమం తగ్గి విషపదార్థాలు బయటకు వెళతాయి. ఆ తరువాత బరువైన ఆహారం తీసుకోకుండా ఉంటే అన్ని దోషాలూ తగ్గుతాయి. 
 
* ప్రతి రోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం పావుగ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. ఆవ నూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే నడుంనొప్పి తగ్గుతుంది.
 
* పంచకర్మ చికిత్సలలో భాగంగా అభ్యంగనం, కటివస్థ చాలా బాగా ఉపకరిస్తాయి. వస్తి చికిత్స కూడా సహాయపడుతుంది. వంకాయ, వేరుసెనగ నూనె, మినప పదార్థాలు, పెరుగులను నడుము నొప్పితో బాధపడేవారు ఎక్కువుగా తీసుకోవడం మంచింది కాదు.
 
* ఒళ్ళు లావుగా వుండి నడుం నొప్పి వుంటే, పావుగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మపండు రసం పోసి పరగడుపున త్రాగుతుంటే, ఒళ్ళు తేలికపడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుం చుట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పశు సంపదను పూజించే పవిత్ర కార్యక్రమం కనుమ : సీఎం చంద్రబాబు

కొత్త అల్లుడికి 465 వంటకాలతో సంక్రాంతి విందు.. (Video)

సింగర్‌తో కలిసి యువతిపై హర్యానా బీజేపీ చీఫ్ అత్యాచారం!!

టూరిస్ట్ బస్సులో మంటలు - నిజామాబాద్ వాసి సజీవదహనం

దక్షిణాఫ్రికాలో ఘోరం... బంగారు గనిలో చిక్కున్న కార్మికులు.. 100 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో రొమాంటిక్ హారర్ జానర్ గా రాజా సాబ్

లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా

విక్రాంత్, చాందినీ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

తర్వాతి కథనం
Show comments