Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాల్చిన చెక్క పొడి కషాయాన్ని బాలింతలు తాగితే...

లవంగాలు, దాల్చిన చెక్క పొడిని రోజూ అర టీ స్పూన్ ఆహారంలో చేర్చుకుంటే అజీర్తిని దూరం చేసుకోవచ్చు. ఉదర సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. లవంగాలు, దాల్చిన చెక్క, శొంఠి, సోంపు పొడిని ఐదు గ్రాములు తీసుకుని..

Webdunia
సోమవారం, 24 జులై 2017 (18:08 IST)
లవంగాలు, దాల్చిన చెక్క పొడిని రోజూ అర టీ స్పూన్ ఆహారంలో చేర్చుకుంటే అజీర్తిని దూరం చేసుకోవచ్చు. ఉదర సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. లవంగాలు, దాల్చిన చెక్క, శొంఠి, సోంపు పొడిని ఐదు గ్రాములు తీసుకుని.. ఒక లీటరు నీటిలో మరిగించి.. ఆ నీరు పావు లీటరు చేరాక కషాయంలా తీసుకుంటే జ్వరం, జలుబు నయం అవుతుంది.
 
ఉదయం, సాయంత్రం పూట రెండు పూటలా ఈ కషాయాన్ని తీసుకుంటే వాత సంబంధిత రోగాలు నయం అవుతాయి. ప్రసవానికి అనంతరం బాలింతకు దాల్చిన చెక్క పొడిని కషాయంలా చేసి తాగిస్తే గర్భసంచి తగ్గి.. పొట్ట పెరగదు. అధిక రక్తస్రావాన్ని కూడా ఈ కషాయం నియంత్రిస్తుంది. 
  
ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనెల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఉద‌యం, రాత్రి భోజ‌నానికి అర‌గంట ముందు తాగుతుంటే ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, కొంత తేనెను క‌లిపి ఆ నీటిని నోటిలో పోసుకుని పుక్కిలిస్తుంటే నోటి దుర్వాస‌న తొలగిపోతుంది.
 
అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్న వారికి తేనె, దాల్చిన చెక్క పొడిల మిశ్ర‌మం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 2 టేబుల్ స్పూన్ల తేనె, 3 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకుని ఒక గ్లాస్ నీళ్ల‌లో వేసి బాగా క‌లిపి తాగుతుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ త‌గ్గిపోతుంది. త‌ద్వారా బ‌రువు కూడా త‌గ్గుతారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments