Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొజ్జ కరగాలంటే.. వేపు పువ్వు పొడిని.. ఇలా వాడాలట..

Webdunia
గురువారం, 18 జులై 2019 (12:22 IST)
వేపుపువ్వు ఎంత మేలు చేస్తుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వేపవువ్వు సహజ యాంటీబయోటిక్‌. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలూ ఎక్కువే. అలాంటి వేప పువ్వును ఎండబెట్టి పొడికొట్టుకుని.. కషాయం లేదా టీ రూపంలో తీసుకోవడం ద్వారా మధుమేహం, గ్యాస్ సమస్యలు, జలుబు, దగ్గు, నోటిపూత తగ్గిపోతాయి. 
 
వేపపువ్వుకి కొవ్వునీ పొట్టనీ కరిగించే గుణం కూడా ఉంది. ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది. కళ్లసమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి అన్నంలో నేరుగా కలుపుకునో లేదా చారుల్లో కూరల్లో వేపపువ్వు పొడిని వేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఈ పొడిని తేనెలో కలిపి గాయాలూ పొక్కులమీద రాసినా, నూనెలో కలిపి బ్లాక్‌హెడ్స్‌మీద రాసినా అవి క్రమంగా తగ్గిపోతాయి. 
 
చర్మంమీద దద్దుర్లు, పొక్కుల్లాంటివి వస్తే కాసిని వేపాకు పువ్వులను మెత్తగా నూరి రాస్తే ఇన్ఫెక్షన్లు క్రమంగా తగ్గుతాయి. వేప పువ్వుల పొడిని పరగడుపున గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ తొలిగిపోవడంతోబాటు కాలేయం శుభ్రపడుతుంది. ఈ పేస్టుని క్రమం తప్పకుండా తలకి పట్టించి తలస్నానం చేయడం వల్ల దురద, చుండ్రు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

తర్వాతి కథనం
Show comments