ఇంగువ పొడిని అన్నంలో కలిపి తీసుకుంటే..?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (10:15 IST)
చాలామంది అజీర్తితో ఎక్కువగా బాధపడుతుంటారు. ఎందుకంటే.. వారు సరిగ్గా భోజనం చేయకపోయినా, సమయానికి తినకపోయినా అజీర్తి సమస్య వేధిస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినను ఎలాంటి ఫలితం ఉండదు. ఒక్కోసారి ఎక్కువగా తిన్నా కూడా అజీర్తిగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇంట్లో ఈ చిట్కాలు పాటిస్తే చాలు...
 
1. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిన తరువాత గ్లాస్ అల్లం రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటి ఖనిజాలు జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతాయి. 
 
2. రోజూ మీరు తీసుకునే ఆహారంలో మజ్జిగ లేదా పెరుగు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే.. ఈ రెండు పదార్థాలు అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. అందువలన తరచు భోజనంలో ఈ రెండింటిని తీసుకోవడం మరచిపోవద్దు. 
 
3. భోజనం చేసిన తరువాత గ్లాస్ గోరువెచ్చని నీరు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అజీర్తిగా ఉన్నప్పుడు ఈ నీటిలో స్పూన్ ఉప్పు కలిపి సేవిస్తే సమస్య నుండి విముక్తి లభిస్తుంది. 
 
4. నిమ్మరసంలో పీచు పదార్థం అధిక మోతాదులో ఉంటుంది. దీనిలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తాయి. శరీరానికి కావలసిన ఎనర్జీనీ కూడా అందిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కడుపునొప్పికి నిమ్మరసం దివ్యౌషధం.
 
5. భోజనం చేసేటప్పుడు మెుదటి ముద్దలో కొద్దిగా ఇంగువ పొడి కలిపి తీసుకోవాలి. ఆ తరువాత మీరు తినాలనుకున్న పదార్థాలన్నీ తీసుకోవచ్చు. ఇలా రోజూ క్రమంగా చేస్తే అజీర్తికి చెక్ పెట్టవచ్చును. 
 
6. సాధారణంగా హోటల్స్‌కి వెళ్ళినప్పుడు భోజనం తిన్న తరువాత సోంపు ఇస్తారు. ఎందుకంటే.. కొందరికి తిన్న ఆహారం జీర్ణం కాదు.. కాబట్టి వచ్చిన వారందరికి సోంపు ఓ కప్పులో వేసి ఇస్తారు. సోంపు అజీర్తికి మంచిగా పనిచేస్తుంది. 
 
7. కప్పు నీటిలో 2 స్పూన్ల జీలకర్రను నానబెట్టుకోవాలి. కాసేపటి తరువాత ఆ నీటిని తీసుకుంటే గ్యాస్ సమస్య ఉండదు. జీలకర్రలోని విటమిన్ డి, ఇ, మినరల్స్, క్యాల్షియం వంటి లవణాలు జీర్ణ సమస్యను నయం చేస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇద్దరు పిల్లల్ని, భర్తను వదిలేసి లవర్‌తో భార్య జంప్, మహాశివరాత్రి ప్రేమికుడు హత్య

Colombo to Amaravati: నారా లోకేష్ పనితీరు అదుర్స్..12గంటల్లో కొలంబో టు అమరావతి

ఈవీ ట్రాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయాలకు గుడ్ బై?

Rain forecast: అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్

రాజస్థాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన ఏడుగురు.. క్రాకర్స్ వల్లే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

డానీ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది

Shivani Nagaram: కథలో దిబెస్ట్‌ పిక్‌ చేసుకుంటున్నాను : శివానీ నగరం

2 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.96 కోట్ల వసూళ్లు దక్కించుకున్న కపుల్ ఫ్రెండ్లీ

Allu Sneha Reddy,: ఆటోపై అల్లు అర్జున్ పేరును చూపించడం గర్వకారణం : అల్లు స్నేహ రెడ్డి

తర్వాతి కథనం
Show comments