Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతుంటారో.. అలాంటి వారు....

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (22:09 IST)
సమతుల్యమైన ఆహారం, ఆలోచనలు, నిద్ర, మైథునం తదితర అంశాలను ఆయుర్వేదం బోధిస్తుంది. ఇందులో మనిషి ఏయే పనులు చేయాలి, ఏయే పనులు చేయకూడదు అనే అంశాలను తెలుపుతుంది. ఆయుర్వేదం ద్వారా రోగులకు రోగాల నుంచి ఎలా ముక్తి పొందాలి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే ఆరోగ్యవంతులు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను తెలిపేదే ఆయుర్వేదం. 
 
ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం, జబ్బులతో కూడుకున్న రోగి ఆరోగ్యాన్ని మరింతగా నయం చేయడమే ఆయుర్వేద వైద్య విధానమని ఆయుర్వేద వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో తెలిపిన కొన్ని ప్రాథమిక అంశాలను మనిషి ప్రతి రోజు పాటిస్తుంటే నిత్యం ఆరోగ్యవంతునిగా జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
ఆయుర్వేద చికిత్సా విధానంలో ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా సమయాన్ని గడపాలి, దీని కొరకు మనిషి తన దినచర్యను ఎలా పాటించాలనేది ఇందులో ప్రధాన అంశాలు. 
 
ప్రాతఃకాలం నిద్రనుండి మేల్కొనాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనుకునే వ్యక్తులు ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తులు ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్య, బలం, తేజస్సు, ధనం సమృద్ధిగా ఉంటాయి. ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతుంటారో వారి ఆయుష్షు క్షీణించడంతోపాటు శరీరంలోని శక్తి నశిస్తుంది. ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బులతో బాధపడుతుంటారని ఆయుర్వేద వైద్యం చెబుతోంది. 
 
ఉషఃపానం : ప్రాతఃకాలం నిద్రలేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందు చల్లటి నీటిని సేవించాలి. రాత్రి పడుకునే ముందు రాగిపాత్రలో నీటిని భద్రపరచుకోవాలి. నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర లేచిన తర్వాత కనీసం అరలీటరు వీలైతే ఒక లీటరు నీటిని సేవిస్తే మరీ మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇలా నీటిని సేవించడం వలన శరీరంలోనున్న కఫం, వాయు, పిత్త దోషాలు నశిస్తాయి. దీంతో వ్యక్తి బలశాలి, దీర్ఘాయుష్మంతుడుగా మారుతాడు. ఉదరం పూర్తిగా శుభ్రపడుతుంది.   
 
మల-మూత్ర-త్యాగం : ఉషఃపానం చేసిన తర్వాత వ్యక్తి మల-మూత్ర విసర్జన చేయాల్సి వుంటుంది. మల-మూత్ర విసర్జన చేసే సమయంలో వ్యక్తులు మౌనాన్ని పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోను మల-మూత్ర వేగాన్ని నియంత్రించకూడదు.
 
దంతావధానం : మల-మూత్రాదులను విసర్జించిన తర్వాత వ్యక్తి దంతావధానం(పళ్లు తోముకోవడం) చేయాలి. దంతాలను శుభ్రపరిచిన తర్వాత నాలుకను శుభ్రపరచాలి. 
 
వ్యాయామం మరియు వాయుసేవనం : శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు నియమానుసారం యోగాసనాలు లేదా వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సివుంటుంది. ఉదయం, సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి వ్యక్తి తన శక్తి మేరకు వ్యాయామం చేయాలి. 
 
నూనె-మాలిష్ : ప్రతి రోజు శరీరం మొత్తానికి నూనెతొ మాలిష్ చేయాలి. నూనెతో మాలిష్ చేయడం వలన తలలోనున్న వేడి తగ్గి కాస్త చల్లబడుతుంది. 
 
స్నానం : ప్రతి వ్యక్తి శుభ్రమైన నీటితో స్నానం చేయాలి. 
 
భోజనం : మనిషి ఆహారాన్ని భుజించే సమయంలో బాగా నమిలి తినాలి. మీరు తీసుకునే భోజనంలో పౌష్టిక తత్వాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారం రుచికరంగా ఉందికదా అని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. మీరు తీసుకునే ఆహారం మితంగానే ఉండాలంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. 
 
భోజనానంతరం చేయాల్సిన పనులుః భోజనానంతరం దంతావధానం తప్పనిసరిగా చేయాలి. దీంతో దంతాల మధ్య పేరుకుపోయిన ఆహార పదార్థాలు బయటకు వచ్చేస్తాయి. 
 
భోజనానంతరం చేయకూడని పనులుః భోజనానంతరం పరుగు, వ్యాయామం, ఈత, స్నానం తదితరాలు చేయకూడదు. భోజనం ముగించిన వెంటనే కూర్చుని పని చేయకూడదు. దీంతో ఆరోగ్యానికి పూర్తి దెబ్బ అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.   
 
శయనం : రాత్రి పూట భోజనం ముగించిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. ఎడమవైపుకు తిరిగిపడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

తర్వాతి కథనం
Show comments