Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్రి ఆకుల చూర్ణంతో పురుషుల్లో శక్తి... స్త్రీలకు ఎద సౌందర్యం... ఇంకా...

మర్రిచెట్టు మూత్రవ్యాధులపై పనిచేస్తుంది. జ్వరమును అరికడుతుంది. చర్మ రోగాలను తగ్గిస్తుంది. శీఘ్ర వీర్య స్ఖలనాన్ని ఆపుతుంది. ఇంకా అనేకమైన రోగాలపై పనిచేస్తుంది. 5 నుంచి 10 గ్రాముల మర్రి ఊడలను తింటే మూత్రం నుంచి వీర్యం పడిపోవడం ఆగిపోతుంది. శీఘ్ర స్కలనం త

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (19:20 IST)
మర్రిచెట్టు కింద కూర్చుని సేద తీరితే ఎంతో మంచిదని మన పెద్దవారు చెబుతుంటారు. చెట్టు కింద కూర్చుంటేనే అంత మంచిదైతే మర్రిచెట్టు ఆకులను తింటే ఇంకా ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో తెలుసుకుందామా...
 
మర్రిచెట్టు మూత్రవ్యాధులపై పనిచేస్తుంది. జ్వరమును అరికడుతుంది. చర్మ రోగాలను తగ్గిస్తుంది. శీఘ్ర వీర్య స్ఖలనాన్ని ఆపుతుంది. ఇంకా అనేకమైన రోగాలపై పనిచేస్తుంది. 5 నుంచి 10 గ్రాముల మర్రి ఊడలను తింటే మూత్రం నుంచి వీర్యం పడిపోవడం ఆగిపోతుంది. శీఘ్ర స్కలనం తగ్గిపోయి వీర్య బలం పెరుగుతుంది. 
 
అంతేకాదు మర్రివూడలను చిన్న ముక్కలుగా కోసి, గాలికి ఎండబెట్టి దంచి పొడిజేసి జల్లెడ పట్టి నిల్వ జేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా ఈ పొడిని తిని మంచినీరు త్రాగుతుంటే రకరకముల యోని స్రావాలు తగ్గిపోతాయి. అధిక వేడి నశించిపోతుంది. శరీరమునకు మంచి రంగు, కాంతి వస్తాయి. అంతకుముందు తరిగిపోయిన బలం మరలా సమకూరుతుంది.
 
లేత మర్రి వూడలను తెచ్చి మెత్తగా నూరి ఆ ముద్దను చను మొనలు వదిలి చనులకు పూసి కట్టుగట్టి ఉదయం తీసి వేస్తుంటే జారిపోయిన స్తనాలు గట్టిపడతాయి. రోజూ పచ్చివూడలు దొరకనివారు ఒక్కసారే చాలా వూడలను తెచ్చి ఎండబెట్టుకుని, పొడిచేసి ఉపయోగించుకోవచ్చు లేదా మర్రివూడలను మంచినీటితో కలిపి కషాయంలా కాచి చల్లార్చి తాగుతుంటే పైత్యం తగ్గిపోయి జ్వరం హరించిపోతుంది.
 
మర్రిచెట్టు లేత వూడల రసం 10 గ్రాములు తీసుకొని దానిలో మెత్తగా నూరిన 5 మిరియాల గంధాన్ని కలిపి ప్రతిరోజూ సేవిస్తుంటే కుష్టు రోగాలు, సవాయి మేహరోగములు, చర్మరోగములు  హరించిపోతుంది. ఎర్రగా ఉండే మెత్తని మర్రి చిగుళ్లను తెచ్చి నీడలో ఎండించి పొడి చేయాలి. అరచెంచా పొడిచేసి పావులీటరు కషాయం మిగిలే వరకు చిన్నమంటపై కాచి దించి వడపోసి దానిలో తగినంత కలకండ గలిపి వేడిగా ఉదయం సాయంత్రం తాగుతుండాలి. దీనివల్ల మెదడుకు బలం కలుగుతుంది. తలలో పేరుకున్న కఫము హరించిపోయి తుమ్ములు ఆగిపోయి, ప్రశాంతత కలుగుతుంది.
 
బాగా ముదిరిన మర్రి ఆకులను ఎండించి ఒక లీటరు మంచినీటిలో 10 గ్రాముల బరువు ఉన్న మర్రి ఆకులను వేసి పావులీటరు కషాయము మిగిలేవరకు చిన్న మంటపై మరగపెట్టి దించి వడపోసి అందులో మూడు చిటికెలు ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం తాగుతుండాలి. దీని వల్ల పీడకలలు రావటం, గుండె బరువై వూపిరాడక పోవటం, నిద్రలో పెద్దగా అరవటం భయపడడం తగ్గిపోతాయి.
 
లేత మర్రి ఆకులు 10 గ్రాములు తీసుకొని మంచినీరు 150 గ్రాములు కలిపి మెత్తగా నూరి పల్చని గుడ్డతో వడకట్టాలి. అందులో కొంచెం కలకండ కలిపి రెండుపూటలా త్రాగుతుంటే గుండెదడ పూర్తిగా తగ్గిపోతుంది. మర్రి ఆకులు 20 గ్రాములు, 7 లవంగాలు ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బట్టలో వేసి రసం పిండి దానిలో కొంచెం కలకండ కలిపి త్రాగితే వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
 
లేత మర్రి మొగ్గలు 10 గ్రాములు గ్రహించి తగినంత నీరు కలిపి మెత్తగా నూరి బట్టలో వడపోసి కండ చక్కెర కలిపి రెండు పూటలా త్రాగుతుంటే విరేచనాలు, నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి. లేత మర్రి ఆకులు 25 గ్రాములు తీసుకొని పావు లీటరు మంచి నీటిలో కలిపి మెత్తగా నూరి గుడ్డలో వడపోసుకుని రోజూ త్రాగుతుంటే రక్తమొలలు పూర్తిగా తగ్గిపోతాయి. రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది. లేత మర్రి మొగ్గలు 10 గ్రాములు గ్రహంచి దానితో పాటు బాగా లేతగా ఉన్న దేశవాళీ వంకాయ ఒకటి కలిపి, ఆ రెండింటినీ కలుపుకుని తింటుంటే నడుము నొప్పి తగ్గుతుంది. 
 
మర్రి ఆకులను నీటిలో వేసి చిన్నమంటపైన మరగబెడుతూ కషాయం చిక్కబడే వరకు మరిగించి దించి ఆ కషాయంలో తగినంత కలకండ కలిపి సేవిస్తుంటే అపరిమితమైన వీర్యవృద్థి కలుగుతుంది. 
 
ఎర్రని రంగులో ఉండే లేత మర్రి ఆకులను తెచ్చి నీడలో గాలి తగిలే చోట ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణమును కొంచెం నేతితో వేయించి దానితో సమానముగా కలకండ పటిక బెల్లం కలిపి నిల్వ ఉంచుకోవాలి. దీనిని రెండుపూటలా ఆహారంకు గంట ముందుగా ఒక చెంచా మోతాదుగా సేవించి చిక్కని పాలలో కొంచెం చక్కెర కలుపుకుని తాగాలి. ఇలా 40 రోజుల పాటు సేవిస్తే బ్రహ్మచర్యాన్ని పాటిస్తే ఆ తదుపరి సంభోగములో అమిత సమయం వీర్యస్ఖలనం కలిగి స్త్రీ పురుషులకు అధికమైన సౌఖ్యం ప్రాప్తిస్తుంది.
 
మర్రి ఆకులను నీడలో ఎండబెట్ట దంచి పొడిచేసి సమానముగా చక్కెర కలిపి నిలువ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం 1/2 చెంచా మోతాదుగా ఈ పొడిని మంచి నీటితో సేవిస్తుంటే స్త్రీల బట్టంటు రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి. మర్రి ఆకుల చూర్ణమును చేసుకొని రెండు పూటలా 1/4 చెంచా మోతాదుగా ఈ పొడిని మంచినీటితో సేవిస్తుంటే కీళ్ళనొప్పులు అద్భుతంగా పనిచేస్తాయి. మర్రి ఆకులు 20 గ్రాములు తీసుకొని కొంచెం నలగ గొట్టి అరలీటరు మంచినీటిలో వేసి పావు లీటరు కషాయము మిగిలే వరకు చిన్నమంటపై మరగబెట్టి దించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత దానిలో ఒక చెంచా మంచి తేనె 1 చెంచా కలకండ కలిపి రెండుపూటలా సేవిస్తుంటే రక్తములోని మాలిన్యాలు తొలగిపోయి రక్తము శుభ్రపడి చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

ఈ-కార్ రేస్‌కు నిధుల మళ్లింపు - ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

తర్వాతి కథనం