Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీ రేకుల టీ తీసుకుంటే..?

rose
Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (10:15 IST)
సువాసన వెదజల్లో గులాబీ పువ్వులంటే నచ్చని వారుండరు. ఇంకా చెప్పాలంటే యువతలకైతే గులాబీ పువ్వులంటే పిచ్చి. గులాబీ చర్మం సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
 
1. గులాబీ రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో మరిగించి అందులో కొద్దిగా నిమ్మరసం, చక్కెర, మిరియాల వేసి కాసేపు మరిగించుకోవాలి. ఆ తరువాత వడగట్టి తీసుకుంటే గొంతునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
2. గులాబీ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీరాన్ని తాజాగా మార్చుతాయి. ఈ ఆకుల బాగా ఎండబెట్టుకుని పొడిచేసి గ్లాస్ పాలలో కలిగి సేవిస్తే ఒత్తిడి, అలసట తగ్గుతుంది. 
 
3. గులాబీ రేకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మం దురదలు, ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు తొలగిపోతాయి. చాలామంది గర్భిణులు వాంతులతో బాధపడుతుంటారు.. దీనిని చెక్ పెట్టాలంటే.. గులాబీ రేకుల వాసన పీల్చుకుంటే ఫలితం ఉంటుంది. 
 
4. గులాబీ ఆకులను మెత్తగా రుబ్బుకుని అందులో కొద్దిగా తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. 
 
5. గులాబీ ఆకులతో తయారుచేసిన టీ తీసుకుంటే శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ టీని ప్రతిరోజూ ఉదయాన్నే సేవిస్తే అధిక బరువు కూడా తగ్గే అవకాశాలున్నాయని చెప్తున్నారు. 
 
6. మెుక్కజొన్న పిండిలో కొద్దిగా గులాబీ రేకుల పొడి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు పోతాయి. 
 
7. శరీర వేడిని తగ్గించుటకు గులాబీ రేకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. గులాబీ రేకులతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే వీటిలోని న్యూట్రియన్స్ శరీరంలో ప్రవేశిస్తాయి. తద్వారా వేడి తగ్గుముఖం పడుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments