Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకూర, పన్నీర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (10:53 IST)
పాలకూరను ఆహారంగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధులను నివారించవచ్చని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. శరీరానికి కావలసిన ఐరన్ పాలకూరలో అధికంగా ఉంది. ఈ ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. జ్వరం, పిత్తం, వాయు శ్వాస సంబంధిత రోగాలకు పాలకూర దివ్యౌషధంగా పనిచేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అధికంగా ఉంది.
 
పాలకూరలో లభించే విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు క్యాన్సర్ వ్యాధులను నివారించడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో పాలకూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.
 
స్త్రీల సౌందర్యానికి పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్ సూప్‌లోనూ, చపాతీలు పిండిలో, పకోడీల పిండిలో, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ పాలకూరను వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లా పాలకూరను కూరలా, వేపుడుగా చేసుకుని కూడా తినవచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments