Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుర్ర పనిచేయట్లేదా? మొద్దుబారిన మెదడును నిద్రలేపాలా? దాల్చినచెక్క తీసుకోండి.!

బుర్ర పనిచేయట్లేదా.. జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా? అయితే దాల్చిన చెక్కను ఉపయోగించండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు బోలెడున్నాయి. కొత్తగా ఏదైనా నేర్చుకునేవారికి ఆ పనిని సులభతరం

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (11:32 IST)
బుర్ర పనిచేయట్లేదా.. జ్ఞాపకశక్తి తగ్గిపోతుందా? అయితే దాల్చిన చెక్కను ఉపయోగించండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు బోలెడున్నాయి. కొత్తగా ఏదైనా నేర్చుకునేవారికి ఆ పనిని సులభతరం చేసే గుణం దాల్చిన చెక్కలో ఉందని పరిశోధనలు తేల్చాయి. పంచేంద్రియాల ద్వారా గ్రహించే సమాచారాన్ని మెదడులోని "హిపోకమస్‌'' అనే భాగం క్రమబద్ధీకరించి, నిక్షిప్తం చేస్తుంది.
 
హిపోకమస్‌లోని ''సీఆర్‌ఈబీ'' అనే మాంసకృత్తుల వల్లే ఇది సాధ్యమవుతుంది. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండేవారిలో సమాచార సేకరణ, జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటుంది. తక్కువ సంఖ్యలో ఉంటే ఎంత చదివినా ఓ పట్టాన బుర్రకెక్కదు. అలాంటి వారు ఏం చేయాలంటే.. రోజువారీగా దాల్చిన చెక్క పొడిని టీల్లో కలుపుకుని తీసుకోవాలి. చురుకైన అభ్యాసానికి దాల్చిన చెక్క ఎంతో తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
దాల్చిన చెక్క‌ను వంట‌కాల్లో మ‌నం మ‌సాలా దినుసుగా వాడ‌తాం. అలాంటి దాల్చిన చెక్కతో తేనెను మిక్స్ చేసుకుని తీసుకుంటే బరువు తగ్గుతారు. గోరు వెచ్చ‌ని నీరు రెండు భాగాలు, ఒక భాగం తేనె, ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి. అన్నింటినీ క‌లిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని శ‌రీరంలో నొప్పి, వాపు ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. దీంతో నొప్పులు, వాపులు త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇలా చేయ‌డం వ‌ల్ల ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 
 
ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని క‌ల‌పాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి 15 నిమిషాలు ఆగాక త‌లస్నానం చేయాలి. దీంతో వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం... 10 సైనికుల మిస్సింగ్

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments